22 గంటల టాక్ టైమ్‌ తోపాటు, నెలరోజుల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలుగా  కంపెనీ పేర్కొంది.  

ఒక్కసారి చార్జ్ చేస్తే.. నెలంతా వాడొచ్చు

ప్రపంచమంతా మెచ్చిన ఫోన్ అది... స్మార్ట్ ఫోన్లు వచ్చాక దాని చరిష్మా కనుమరుగైంది. అది కూడా చరిత్రపుటల్లో కలిసిపోయింది. అయితే వినియోగదారులను నుంచి డిమాండ్ రావడంతో మళ్లీ ఆ కంపెనీ కొత్త ఫీచర్లతో ఆ ఫోన్ ను తీసుకొచ్చింది.

ఇంతకీ ఆ ఫోన్ ఏంటో తెలుసా... 'నోకియా 3310' ..

డబ్బాలా ఉండే ఈ పెద్ద ఫోన్ గురించి అసలు పరిచయమే అక్కర్లేదు. ఇప్పుడు మన మార్కెట్ లోకి మళ్లీ వచ్చింది.

కేవలం రూ. 4 వేల లోపు ధరలో క్లాసిక్ నోకియా 3310 ఫీచర్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూపం పాతదే అయినా కొత్త విజువల్‌ అప్‌గ్రెడేషన్‌, స్వల్ప మార్పులతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యంగా 22 గంటల టాక్ టైమ్‌ తోపాటు, నెలరోజుల బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకతలుగా కంపెనీ పేర్కొంది. పాత ఫోన్ లో ఉండే స్నేక్‌ గేమ్‌ కూడా ఇందులో మరింత అప్‌ గ్రేడ్‌ చేసినట్టు తెలిపింది.