టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే.. నోకియా 2, నోకియా 3 స్మార్ట్ ఫోన్లపై ఎయిర్ టెల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. నోకియా స్మార్ట్‌ ఫోన్లపై 2వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ ఫోన్‌' ఆఫర్‌ కింద నోకియా 2, నోకియా 3 స్మార్ట్‌ ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. దీంతో నోకియా 2 స్మార్ట్‌ ఫోన్‌ అత్యంత తక్కువగా 4,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. నోకియా 3 స్మార్ట్‌ ఫోన్‌ ధర కూడా 7,499 రూపాయలకు దిగొచ్చింది.

ఈ ఆఫర్‌తో పాటు 169 రూపాయల ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో నోకియా 2 స్మార్ట్‌ ఫోన్‌ రూ.6,999కు, నోకియా 3 స్మార్ట్‌ ఫోన్‌ రూ.9,499కు అందుబాటులో ఉన్నాయి.అయితే ఎయిర్‌టెల్‌ ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు వాయిదాల్లో కస్టమర్లకు ఆఫర్‌ చేయనుంది. తొలిసారి 18 నెలల కాలంలో రూ.500 అందిస్తుంది. మిగతా మొత్తం అంటే రూ. 1500 లను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు తమ సిమ్‌ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం రూ. 3500 రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో రూ. 3500 రూపాయలతో రీఛార్జ్‌ చేసుకోవాలి. ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి.
 

నోకియా 2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..

5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 8మెగా పిక్సెల్ బ్యాక్ కెమేరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం

నోకియా 3 ఫోన్‌ ఫీచర్లు...

5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8మెగాపిక్సల్ బ్యాక్ కెమేరా,8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం