మొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంస్థ నోకియా.  నోకియా కంపెనీ భారత మార్కెట్లో మంగళవారం ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుల చేసింది. నోకియా1 పేరిట విడుల చేసిన ఈ  స్మార్ట్ ఫోన్ ని తొలిసారి బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ప్రదర్శించారు. ఈ ఫోన్ లో ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ ని వినియోగించారు.

4.5 అంగుళాల  స్ర్కీన్, 1.1 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, మీడియా టెక్ ఎంటీ6737  చిప్ సెట్ ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. 1GB RAM నిక్షిప్తం చేయబడివుండే ఈ ఫోన్లో 8GB ఇంటర్నల్ స్టోరేజ్, అదనపు స్టోరేజ్ అవసరాలకు 128 GB వరకూ memory card అమర్చుకునే సదుపాయం లభిస్తున్నాయి.ఈ ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరా, LED Flash, ఫోన్ ముందు భాగంలో 2 మెగా పిక్సల్ కెమెరా పొందుపరచబడి ఉన్నాయి.

ఈ ఫోన్ ధర రూ.5,499కాగా ఈ ఫోన్ కి రిలయన్స్ జియో 2,200 రూపాయల విలువైన cashback లభిస్తుంది. అలాగే 60 GB వరకూ మొబైల్ డేటా కూడా అందించబడుతుంది.