టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కాస్త తీరిక దొరికినా చాలు రాంచీ వీధుల్లో బైక్ మీద రయ్ రయ్ అంటూ దూసుకెళ్తుంటాడు. కేవలం రాంచీలోనే కాదు..తన రెండో హోం టౌన్ గా భావించే చెన్నైలో కూడా ధోని బైక్ రైడింగ్ చేస్తుంటాడు. అయితే.. ఈ సారి మాత్రం చెన్నైలో 
బైక్ రైడింగ్ చేయాలనే ఆలోచనకు బ్రేక్ వేశాడు.

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధోని చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యహరిస్తున్నారు. కాగామరో వైపు తమిళనాడులో కావేరి నదీ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఐపీఎల్ మ్యాచులను బహిష్కరించారు కూడా. ఇలాంటి సమయంలో ధోని బైక్ రైడ్ చేస్తూ చెన్నై వీధుల్లో తిరగడం అంత శ్రేయస్కరం కాదనే వాదన వినపడుతోంది.

ధోని చెన్నైలో ఎక్కడికి వెళ్లాలని అనుకున్నా.. అధికారిక వాహనంలో సెక్యురిటీతో మాత్రమే వెళ్లాలని అధికారులు సూచించారు.ధోనికి అభిమానులు ఎక్కువగా ఉండటం వల్లనే ఆయనను బైక్ రైడ్ చేయవద్దని కోరినట్లు అధికారులు చెబుతున్నారు. కారణాలు ఏవైనా.. అధికారుల సూచన మేరకు ధోని బైక్ రైడింగ్ ని ఈసారి వదులుకున్నాడు.