ఇద్దరు భార్యలు ఉంటే ఇల్లు ఉచితమా..? ఇంటి కోసమైనా రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా..? కాస్త ఆగండి. ఎందుకుంటే.. ఇది మన దేశంలో కాదు. యూఏఈలో. భారత దేశంలో భార్య బ్రతికుండగా లేదా విడాకులు తీసుకోకుండా మరో వివాహం చేసుకోవడం చట్టరిత్యా నేరం. కానీ.. కొన్ని దేశాల్లో  ఇలాంటి నియమాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా యూఏఈలో ఎయితే.. ఎంత మందిని పెళ్లి చేసుకుంటే మగవారికి అంత గుర్తింపు.

అక్కడ పురుషులు ఎక్కువ మందిని వివాహం చేసుకోవడాన్ని గౌరవంగా భావిస్తారు. అలా భావించడం మాత్రమే కాదు..అలా చేసుకున్న వారికి స్వయంగా దేశ ప్రభుత్వం కానుకలు కూడా అందజేస్తుంది. ఇంతకీ ఆ కానుక ఏంటో తెలుసా..? అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న పురుషులు.. వాళ్లు ఉండే  ఇంటికి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదట. ఆ అద్దెను షేక్ జాయద్ హౌసింగ్ పథకం కింద ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇంతకీ.. అక్కడి ప్రభుత్వం వాళ్లకు ఇంత పెద్ద బంపర్ ఆఫర్ ఎందుకు ఇస్తుందో తెలుసా..? యూఏఈ లో అవివాహిత మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలనే ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు.