మోదీ ప్రభుత్వం ఇటీవలే దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టింది అప్పటి నుంచి అన్ని వస్తువులపై జీఎస్టీ అమలౌతూ వస్తోంది. హాస్పటల్ రూమ్ కి అయితే.. రోగులు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు

మోదీ ప్రభుత్వం ఇటీవలే దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అన్ని వస్తువులపై జీఎస్టీ అమలౌతూ వస్తోంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ.. ఒక చోట మాత్రం జీఎస్టీ కట్టాల్సిన పనిలేదట. అది ఇంకెక్కడో కాదు హాస్పటల్. చికిత్స నిమిత్తం చాలా మంది రోగులు హాస్పటల్ కి వెళుతూ ఉంటారు. మరి కొందరు చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్ ఉండాల్సి వస్తుంది. అలా ఉన్నవారు.. రూమ్ కట్టే బిల్లుకి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది.

వివిధ వసతి సేవలపై విధించిన జీఎస్టీ గురించి సీబీఈసీ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్) ఇటీవల వివరణ ఇచ్చింది. పలువురు జీఎస్టీ గురించి ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలకు వీరు ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు. హోటల్స్, గెస్ట్ హౌస్ వంటి వాటికి జీఎస్టీ ఏ విధంగా విధిస్తున్నారో అధికారులు తెలియజేశారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం ఏదైనా హోటల్, గెస్ట్ హౌస్ ల రూమ్ రెంటు ఖరీదు రూ.వెయ్యి , అంతకన్నా తక్కువ అయితే.. అప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.వెయ్యి కన్నా ఎక్కువ, రూ.2,500 కన్నా తక్కువ ఉంటే 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.2500 కన్నా ఎక్కువ అయితే..18శాతం, రూ.7,500 కన్నా ఎక్కువ అయితే.. 28శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది.

అదే హాస్పటల్ రూమ్ కి అయితే.. రోగులు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఫుడ్, డ్రింక్స్ వంటి సర్వీసులకు మాత్రం 5శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు.