Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ సినిమాల్లో కంటెంట్ లేదు :  అక్షయ్ కుమార్‌

  • స్క్రిప్ట్ సరిగ్గా లేకపోవడమే పరాజయాలకు కారణం.
  • దక్షణాదిలో అలా కాదన్న అక్షయ్.
  • చాలా జాగ్రత్తలు తీసుకుంటారన్న అక్షయ్.
no content in bollywood movies says akshay kumar

బాలీవుడ్ లో గ‌తంలో ఏనాడు లేనంత ప్లాప్‌ సినిమాలను ఈ సంవ‌త్స‌రం చ‌విచూసింది. ఒక‌టి, రెండు చిన్న సినిమాలు త‌ప్పా, స్టార్ హీరోల ఏ సినిమాలు ఆడ‌లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది బాలీవుడ్ కు అంతగా కలసి రాలేద‌నే చెప్పుకోవాలి. 

 ఇదే విష‌యం పై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాలీవుడ్ సినిమాల్లో సరైన కంటెంట్ లేకపోవడమే దీనికి కారణం కావచ్చని ఆయ‌న‌ అభిప్రాయపడ్డాడు. దక్షిణాదిలో సినీ పరిశ్రమకు చెందినవారు చాలా ప‌ద్ద‌తిగా ఉంటారని చెప్పాడు. ఆయ‌న ద‌క్ష‌ణాది సినిమాల్లో న‌టిస్తున్నారు. రోబో 2.0 లో ఆయ‌న విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నారు. ద‌క్ష‌ణాదిలో స్క్రిప్ట్ మొద‌లు నుండి చివ‌రి షాట్‌ వ‌ర‌కు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని, బాలీవుడ్ లో ఒక సారి సినిమా లాక్ అయితే మార్పులు చేయ్య‌డం జ‌ర‌గ‌ద‌ని, అందుకే చాలా ప్లాపుల‌ను చ‌విచూస్తుందని ఆయ‌న తెలిపారు.

న‌టుడిగా విల‌న్ క్యారెక్ట‌ర్ చేయ‌డం తేలికేమీ కాద‌ని, క‌థలోని క్యారెక్ట‌ర్ న‌చ్చితే ఏ రోల్ చెయ్య‌డానికి అయినా నేను సిద్ద‌మ‌ని ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లో ఆయ‌న సినిమా టాయ్ లెట్, ఏక్ ప్రేమ్ కథ ప్ర‌మోష‌న్ లో భాగంగా పెర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios