అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త

No Change In H1B Visa System US
Highlights

  • పాతవిధానంలోనే హెచ్‌-1బీ వీసా విధానం
  • వెల్లడించిన అమెరికా

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే హెచ్‌-1బీ వీసా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. పాత విధానాన్నే అమలు పరుస్తున్నారు. ఈ విషయానికి అమెరికానే స్వయంగా వెల్లడించింది. డోనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి హెచ్‌-1బీ వీసా విధానంలో మార్పులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు హెచ్‌-1బీ ఉద్యోగ వీసాల జారీల్లో కఠిన నిబంధనలు తీసుకొస్తామని ట్రంప్‌ అప్పట్లో ప్రకటించారు.  ట్రంప్ ప్రకటన విని.. చాలా మంది భారతీయులు డీలా పడిపోయారు. అయితే ప్రస్తుతం అలాంటి చర్యలేం చేపట్టట్లేదని తాజాగా అమెరికా మంత్రి ఒకరు చెప్పారు.

‘హెచ్‌-1బీ వీసా జారీ విధానంలో మార్పుల కోసం అమెరికాలో ఎలాంటి చట్టం తీసుకురాలేదు. ఈ వీసాల జారీపై సమీక్ష జరపాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. అయితే దాని తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ విధానాన్ని మార్చాలంటే చట్టంలో అనేక మార్పులు తీసుకురావాలి. ప్రస్తుతానికైతే గతంలో ఉన్నట్లుగానే వీసాలు జారీ చేస్తున్నారు’  అని అమెరికా డిప్యూటీ అసిస్టెంట్‌ స్టేట్‌ సెక్రటరీ థామస్‌ వాజ్దా తెలిపారు.

loader