బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయిపై రాళ్లతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. నితీశ్ గతేడాది డిసెంబర్ 12 వ తేదీ నుంచి రాష్ట్ర పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే.

తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేందుకు ఆయన ‘‘ వీకాస్ సమీక్షా యాత్ర’’ చేపడుతున్నారు. కాగా అందులో భాగంగానే నితీశ్.. శుక్రవారం బుక్సర్ లోని నందర్ ప్రాంతానికి వెళ్లారు. కాగా.. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపైకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే అప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రికి సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు సెక్యురిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. అనంతరం అత్యంత పటిష్ట భద్రతల నడమ సీఎంను అక్కడి నుంచి పంపించేశారు.