ప్రజలను డిజిటల్ వైపు మళ్లించేందుకు కేంద్రం ఆఫర్

పెద్ద నోట్లు రద్దై జనాలు నానా కష్టాలు పడుతుంటే.. కేంద్రం మాత్రం చిల్లర కొరతపై దృష్టి పెట్టకుండా ఇదిగో బంపర్ ఆఫర్ ఇస్తున్నాం పండగజేసుకోండి అంటోంది.

ప్రజలను ఆన్ లైన్ లావాదేవీల వైపు నడిపించేందుకు ఈ ఆఫర్లు తీసుకొచ్చినట్లు నితీఆయోగ్ ప్రకటించింది.

పేద, మధ్య, చిన్నతరహా వ్యాపారుల్లో డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించేందుకు రెండు ఆఫర్లు ప్రారంభిస్తున్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌‌కాంత్‌ ప్రకటించారు.

డిసెంబర్ 25 నుంచి ఈ పథకాలను అమలు చేస్తారు. ఈ పథకాల అమలు 100 రోజుల వరకే ఉంటుంది.

ఈ పథకాలలో ఒకటి ‘లక్కీ గ్రాహక్‌ యోజన’. దీని కింద ప్రతిరోజూ 15 వేల మంది విజేతలను ఎంపికచేసి వారికి రూ.1000 చొప్పున బహుమతిగా ఇస్తారు.

రెండోది డిజిధన్‌ వ్యాపారి యోజన. వారానికి ఒకసారి 7 వేల మందిని ఎంపిక చేసి వాళ్లకి లక్ష, 50 వేలు చొప్పున బహుమతి ఇస్తారు.

100 రోజుల్లో వచ్చిన కస్టమర్లకు ఏప్రిల్ 14న మెగా అవార్డ్ ప్రకటిస్తారు.

ఇందులో మొదటి ఫ్రైజ్ కోటి, రెండో బహుమతి 50 లక్షలు.

ఈ బహుమతుల కోసం కేంద్రం రూ. 340 కోట్ల నిధులను విడుదల చేసింది.