Asianet News TeluguAsianet News Telugu

భయపెడుతున్న నీపా వైరస్: ఆరుగురు మృతి


కోచికోడ్: కేరళ రాష్ట్రాన్ని నీపా వైరస్ భయకంపితులను చేస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఆరుగురు మరణించారు.

Nipah virus claims 6 lives in Kerala

కోజికోడ్: కేరళ రాష్ట్రాన్ని నీపా వైరస్ భయకంపితులను చేస్తోంది. ఈ వైరస్ సోకి ఇప్పటికే ఆరుగురు మరణించారు. మృతుల సంఖ్య కొజికోడ్ జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. 

ఆరోగ్య శాఖ అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని, వైరస్ శరీర ద్రవాలను స్పృశించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి సోకుతోందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ చెప్పారు. 

గత పక్షం రోజుల్లో మూడు మరణాలు సంభవించాయి. వారిలో దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న తోబుట్టువులు. నీపా వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్న మరో వ్యక్తి వారి తండ్రి. 

ఈ వ్యాధి మనుషుల్లోనూ జంతువుల్లోనూ కనిపిస్తుంది. ఫ్రూట్ బ్యాట్స్ ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఆ కుటుంబానికి చెందిన బావిలో ఫ్రూట్ బ్యాట్ కనిపించింది. ఆ బావిని ఇప్పుడు మూసేశారు. 

నీపా వైరస్ సోకిన ముగ్గురికి నర్సింగ్ అసిస్టెంట్ లీని చికిత్స అందించారు. ఆ ముగ్గురు కూడా మరణించారు. లినీ కూడా మృత్యువాత పడింది. మరో ఐదుగురు తీవ్రమైన జ్వరంతో కొజికోడ్, పొరుగున ఉన్న మాలాపురం జిల్లాలో మరణించారు. ఈ ఐదుగురి విషయంలో వైరస్ లక్షణాలు కనిపించాయి.

శైలజ, కొజికోడ్ జిల్లాకు చెందిన కార్మిక మంత్రి టీపి రామకృష్ణన్ అధికారులతో చర్చించి, వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితిని అంచనా వేయడానికి ఎన్ఎస్ డీసి బృందం కోజికోడ్ కు చేరుకుంది. 

రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రెండో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శైలజ చెప్పారు.

నీపా వైరస్ ను 1998లో మలేసియాలోని కంపుంగ్ సింగాయ్ లో తొలిసారి గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios