చంద్రబాబు రివ్యూలతో అధికారులలో విసుగురివ్యూలు పనిని మెరుగుపర్చడం కాకుండా  అడ్డంకి గా మారాయిరివ్యూలలో ఉపన్యాసమే తప్ప సారం లేదంటున్న అధికారులుఇక ఆపేయకపోతే నష్టమనుకున్న ముఖ్యమంత్రి 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరంభాలు అట్టహాసంగా ఉంటాయి. ఆయన ప్రకటనలతో పండగ చేయిస్తారు. పండగయిపోగానే జారుకుంటారు. ఇపుడు పోలవరం విషయంలో ఇలా గే జరిగింది. పోలవరం సోమవారం సమీక్షలు ఇక చేయనని ప్రకటించారు. నిన్నటితో మానేశారు. పోలవరం ప్రాజక్టు మీద ప్రతి సోమవారం రివ్యూ చేస్తానని ఎనిమిది నెలల కిందట ప్రకటన చేశారు. ఆయన చుట్టూ ఉన్న అధికారులు సోమవారానికి ‘పోలవారం’ అని పేరు పెట్టి చప్పట్లు కొట్టారు. ఇంతవరకు 35 సమీక్షలు నిర్వహించారు. ప్రతిసమావేశంలోనూ పని చేయకపోతే, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతా, తాట వొలుస్తానని బెదిరించారు. ఎనిమిది నెలలు బెదిరిస్తూ వచ్చినా ఒక్కరిని బ్లాక్ లిస్టులో పెట్టిందిలేదు. పోలవరం సమీక్ష కోసం డ్రోన్లు వాడారు. రిమో ట్ సమీక్ష అన్నారు. అయితే, చివరకు ఏమనుకున్నారో ఏమో నిన్నటి సమీక్షనే లాస్ట్ అని చెప్పేశారు. ఇక ఆయన సమీక్ష చేయరట. దీని మీద ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఉన్న వివరణ ఇది:

‘పోలవరం ప్రాజెక్టు పనులపై ఇక నుంచి అధికారులే సమీక్షలు నిర్వహించి, పురోగతిని ప్రతివారం తనకు వివరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ‘సమీక్షలు మీరు నిర్వహిస్తే అవసరమయ్యే పరిష్కారాలను నేను సూచిస్తూ మార్గదర్శకత్వం చేస్తానని అన్నారు. ఫలితాలు సాధించేలా సమీక్షలు జరగాలనేది నా ఉద్దేశం. ’ అని ఆయన చెప్పారు. సమీక్ష సారాంశాన్ని వివరించడం ద్వారా తాను వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సమయాన్ని ఆదా చేయడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. పోలవరం సహా 28 ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణానికి తలెత్తే ఇబ్బందులను తొలగించి పనులు వేగంగా, సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సైతం అధికారులదేనని స్పష్టం చేశారు.’

అయితే, అధికారులు ఇదొక గొప్ప ఉపశమనంగా భావిస్తున్నారు. ఈ రివ్యూల వల్ల పనులు వేగంగా జరగకపోవడం కాదు, కుంటువడుతున్నాయని వారంటున్నారు. అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి కట్టి పడేయడం వల్ల వారు మరొక పనిమీద దృష్టిపెట్టలేకపోతున్నారనే అభ్యంతరం మొదట అధికారుల్లో మొదలయింది. అధికారుల్లో వచ్చిన వ్యతిరేకత మెల్లిగా ముఖ్యమంత్రి చెవిని పడింది. వ్యవహారం చెడిపోతూ ఉందని గ్రహించి ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు ‘ రివ్యూలు మీవి, పరిష్కారం’ అనే కొత్త సిద్ఘాంతం తీసుకువచ్చారు. ఇక నేను రివ్యూచేయను, మీరే చేయండన్నారు. ఏమయితేనేం, అధికారులు హమ్మయ్య అని వూపరి పీల్చుకున్నారు.