Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ తో మనోళ్లను చేర్చుకుంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రమూక

కేరళలోని కాసర్ గడ్ కు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి అఫ్ఘనిస్తాన్ మొబైల్ సిమ్ తో ఓ గ్రూప్ ను క్రియేట్ చేశాడు.

NIA on the alert as Afghan make friends in Kerala over Whatsapp

సాంకేతకత సాయంతో భారతీయులకు వలేస్తుంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదసంస్థ. ఇప్పటి వరకు ఫేస్ బుక్ ను దీని కోసం ఎంచుకున్న వాళ్లు ఇప్పుడు వాట్సాప్ తోనూ అదే పని చేయడానికి సిద్ధమైనట్లు తేలింది.

 

వాట్సాప్ తో కేరళ యువకులను అఫ్ఘనిస్తాన్ కు రప్పించి అక్కడ ఐసీస్ లో చేర్పించేలా ఓ గ్రూప్ ను క్రియేట్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ రహస్యాన్ని చేధించింది. కేరళలోని కాసర్ గడ్ కు చెందిన అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి అఫ్ఘనిస్తాన్ మొబైల్ సిమ్ తో ఓ గ్రూప్ ను క్రియేట్ చేశాడు.

 

ఇందులో దాదాపు 21 మంది సభ్యులగా ఉన్నారు. కేరళ నుంచి అఫ్ఘనిస్తాన్ వెళ్లిన వారి చాట్ వివరాలు ఆ గ్రూప్ లో ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. ఐఎస్ లో చేరాక ఏలా ఉంటుంది. అఫ్ఘన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై ఈ గ్రూప్ లో చాలా యాక్టవ్ గా చర్చజరుగుతున్నట్లు. కేరళ నుంచి అఫ్ఘన్ వలసవెళ్లిన వారి వివరాలు ఇందులో ఉన్నట్లు ఏజెన్సీ అధికారి ఒకరు మీడియాకు వెళ్లడించారు.

 

అయితే ఎన్ఐఏ వాట్సాప్ గ్రూప్ పై మాత్రమే కాకుండా అందులో కేరళ నుంచి అఫ్ఘనిస్థాన్ కు వలసెళ్లిన 14 మంది వివరాలతో కలిపి ఓ కేసును నమోదు చేసింది. త్వరలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios