స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్‌ మేకర్‌ వోల్వో కార్స్‌ సరికొత్త  ఎస్‌యూవీకార్‌ను లాంచ్‌ చేసింది.  ఎస్‌యూవీ ఎక్స్ సి 60 కొత్త వెర్షన్‌ను మంగళవారం విడుదల చేసింది. రూ. 55.9 లక్షలుగా కారు ధర నిర్ణయించారు. అ‍త్యాధునిక భద్రతా లక్షణాలతో, ముఖ్యంగా పాదచారులను,  సైక్లిస్టలను గుర్తించగలిగే టెక్సాలజీతో   దీనిని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. స్టీర్‌ అసిస్ట్‌,  ఎయిర్ సస్పెన్షన్, ఫోర్‌ జోన్ క్లైమేట్ కంట్రోల్,  ఫ్రంట్‌, సీట్ వెంటిలేషన్  తదితర ఇతర ముఖ్య ఫీచర్లుగా ఉన్నాయి. 

 తమ లగ్జరీ మోడరన్‌ స్కాండినేవియన్ డిజైన్ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్‌ వ్యక్తం చేశారు.  తమ కంపెనీ విడుదల చేసి ఎక్స్ సి 60 మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిందని తెలిపారు. భారత్ లోనూ అదేవిధంగా అమ్ముడౌతుందని భావిస్తున్నట్లు చెప్పారు. భారత్ లో 2వేల యూనిట్ల అమ్మకం టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు.