అక్రమ సంబంధానికి అడ్డొచ్చాడనే

new twist on nagaraju murder case
Highlights

  • సాప్ట్ వేర్ నాగరాజు కేసులో వీడిన మిస్టరీ
  • హత్యకు భార్య అక్రమ సంభందమే కారణం
  • వెల్లడించిన నిందితుడు

 హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ హత్య జరిగి 4 రోజులవుతున్నా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ ఇవాళ లాలాగూడలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఆత్మహత్యకు నాగరాజు హత్యకు లింకు ఉన్నట్లు పోలీసులు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతడి నుండి కీలక విషయాలను సేకరించారు.  నాగరాజు హత్యకు ఆయన భార్యే కారణమని నిందితుడు నరేష్ వెల్లడించాడనట్లు పోలీసులు తెలిపారు. 

ఈ హత్య గురించి నిందితుడు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.  హైటెక్ సిటీ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే నాగరాజు భార్యకు, కార్తిక్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. ఈ సంబందానికి అడ్డుగా ఉన్న నాగరాజును తొలగించుకోవాలని భార్య జ్యోతి, కార్తిక్  లు ఓ పన్నాగం పన్నారు. అతడిని హత్యకు పథకం రూపొందించి, దీనికోసం దీపక్, నరేశ్, కార్తిక్, యాసీన్ అనే నలుగురు వ్యక్తుల సహాయాన్ని కోరారు. వీరంతా కలిసి 31 వ తేదీన నాగరాజు ను చౌటుప్పల్ లో పట్టుకుని హత్య చేశారు. శవాన్ని కూడా అదే ప్రాంతంలో పారేసి నిందితులంతా పరారయ్యారు.

అయితే ఈ విషయం నిందితుడు నరేష్ అన్నకు తెలిసి వారిని మందలించాడు. దీంతో ఈ హత్య విషయం ఎక్కడ బైట పడుతుందోనన్న ఆందోళనతో నరేష్ లాలాగూడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యాయత్నం వల్ల నాగరాజు హత్య విషయం బైటకు వచ్చింది.  దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

loader