విజయ్ ఆత్మహత్య పై కీలక విషయాలు బైటపడ్డాయి. అతడి ఆత్మహత్య చేసుకుంటూ రికార్డు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వీడియో ఆధారంగా విచారణ చేపడున్నట్లు సమాచారం.

విజయ్  ఆత్మహత్యకు తన భార్య వనిత, శశిధర్ లతో పాటు మరో అడ్వకేట్ లు కారణమని ఈ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.

3 సంవత్సరాల నుంచి నుంచి విజయ్, వనీత మద్య గొడవలు సాగుతున్నాయి. విడాకుల కోసం కోర్టులో కేసు నడుస్తుండగానే భరణం కోసం వనీత మరో కేసును నమోదు చేసింది.

అయితే ఈ కేసులన్ని విత్ డ్రా చేసుకోవాలంటే వనీత 3 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికోసం విజయ్ ని తీవ్రంగా వేదించినట్లు విజయ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

డబ్బుల కోసం మూడు రోజుల క్రితం వనీత,శశిధర్, అడ్వకేట్ ముగ్గురు తన ఇంటికి వచ్చి గొడవ చేసినట్లు విజయ్ ఆ వీడియోలో ప్రస్తావించినట్లు సమాచారం. తనను డబ్బులు డిమాండ్ చేయగా తన వద్ద అంత డబ్బు లేవని చెప్పానని, దీంతో కారుతో పాటు ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని విజయ్ వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ ముగ్గురి వేధింపులతోనే విజయ్ చనిపోయి ఉంటాడన్న కుటుంబ సభ్యుల ఆరోపణలు, విజయ్ సెల్పీ వీడియోల సాయంతో పోలీసులు ఈ ఆత్మహత్యకు ఎవరు కారణమన్న దానిపై విచారణ చేపడుతున్నారు.