తక్కువ పమయంలో ఎక్కువ వీక్షకులను పొందిన వీడియో యూట్యుబ్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన వీడియో 300 కోట్ల మంది ఈ వీడియోను చూశారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు యూట్యుట్ లో టాప్ సాంగ్ అంటే చాలా మందికి గుర్తుకు వ‌చ్చేది.. మొద‌ట గ‌గ్న‌మ్ స్టైల్, త‌రువాత జ‌స్టిన్ బీబ‌ర్ బేబీ సాంగ్‌, కానీ ఈ రెండు పాట‌ల‌ను దాటేసింది మ‌రో సాంగ్‌. అదే స్పానిష్ భాష లో విడుద‌ల అయిన `డెస్పాసిటో` పాట. ఈ సాంగ్‌ అప్‌లోడ్ అయిన ఆరు నెల‌ల‌కు యూట్యూబ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది.


లూయిస్ ఫాన్సి పాడిన ఈ పాట ను ఇప్ప‌టి వ‌ర‌కు 3,011,987,525 ఇంత మంది ఈ పాట‌ను వీక్షించారు. అంటే 300 కోట్ల మంది పైగా చూశారు. ఇది యూట్యుబ్ చ‌రిత్ర‌లో టాప్ సాంగ్ గా నిలిచిపోయింది. అంతేకాదు 17 మిలియ‌న్ల మంది లైక్ కొట్టారు. ఈ పాట ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని సోష‌ల్ మాధ్యామాల్లో క‌లుపుకొని 460 కోట్ల మంది వీక్షించారు.