జెమ్స్ బాండ్ సినిమా విడుదల ప్రకటించిన నిర్మాత. మరో రెండు సంవత్సరాల వరకు నిరీక్షణ తప్పదు.
జెమ్స్ బాండ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే, సీక్రేట్ ఎజెంట్ గా జెమ్స్ బాండ్ చేసే సహాస కృత్యాలు అందరికి బాగా పరిచయం. ఇప్పటి వరకు 24 జెమ్స్ బాండ్ సినిమాలు వచ్చాయి. అన్ని సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు వచ్చేది 25 వ సినిమా. ఇందులో గత చిత్రంలో నటించిన డానియల్ క్రేయిగ్ నటిస్తున్నారు.
మొదట బాండ్ సినిమాలో నటించనని చెప్పిన క్రేయిగ్, నిర్మాత అభ్యర్థన మేరకు ఒప్పుకున్నారు. 25 వ బాండ్ సినిమా సినిమా చాలా ప్రత్కేకం అయినందున క్రేయిగ్ నటించడానికి పచ్చజెండా ఊపారు. జెమ్స్ బాండ్ సినిమా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తయింది. మిగిలింది షూట్ వెళ్లడమే తరువాయి. ఈ సినిమా వచ్చే నెల 17 నుండి ప్రారంభమై, 2018 నవంబర్ వరకు చిత్రీకరణ పూర్తవుతుంది. తిరిగి 2019 మార్చ్ నుండి ఎడిటింగ్ టెబుల్ మీద ఉంటుంది.
25 వ జెమ్స్ 2019 నవంబర్ 8 వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించారు. జెమ్స్‌బాండ్ 25 వసినిమా రచయితలు నియల్ పూర్వీస్, రాబర్ట్ వాడే, నిర్మాతలు మైకేల్ జీ విల్సన్, బార్బారా బ్రోకలీ.
