తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసింది. నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీకి నోటిపికేషన్తు ఒక్కోటిగా వస్తున్నాయి. దీంతో మళ్లీ యువతలో ప్రభెత్వ ఉద్యోగాలపై ఆశలు చిగురించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ వెల్ఫేర్ ఆపీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.  

టీఎస్‌పీఎస్సీ ద్వారా బీసీ సంక్షేమ శాఖలో మొత్తం  219 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందుకు సంబంధించిన వివరాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ ద్వారా ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 06,2018. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తోపాటు బీఈడీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా టీఎస్ పిఎస్సీ నిర్ణయించింది.