రెండు కొత్త మోడల్ బైకులను విడుదల చేసిన బజాజ్ రెండు బైకులు బడ్జెట్ ధరలోనే లభ్యం

ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో రెండు కొత్త మోడల్ బైకులను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో తన పాపులర్‌ మోడల్‌ బజాజ​ డిస్కవర్‌ 2018 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇందులో డిస్కవర్‌ 110 డిస్కవర్‌ 125 పేరుతో కొత్త మోడల్స్‌ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.కొత్త ఇంజీన్‌, కొత్త ఫీచర్లు, కొత స్టయిల్‌గా సరికొత్తగా వీటిని రూపొందించింది. బజాజ్ డిస్కవర్ 110 ధర రూ.50,176 గానూ, డిస్కవర్ 125లను 53,176లుగా ప్రకటించింది.

బజాజ్ డిస్కవర్ 110 ఫీచర్లు.. 110 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ మోటార్‌, 8.5 బీహెచ్‌పీ వపర్‌, 9 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌

బజాజ్ డిస్కవర్ 125 ఫీచర్లు.. 125 సీసీ సింగిల్‌ సిలిండర్ , ఎయిర్‌ కూల్డ్‌ మోటార్‌,11 బీహెచ్‌పీ వపర్, 10.8 ఎంఎం గరిష్ట టార్క్‌ 5 స్పీడ్‌ ట్రాన్సిమిషన్‌