కోటంరెడ్డి 366 రోజుల ప్రజా ప్రస్థానం ( వీడియో )

nellore Ruram MLA kotamreddy to launch second yatra for 366 days
Highlights

కోటంరెడ్డి 366 రోజుల ప్రజా ప్రస్థానం ( వీడియో )

‘ప్రజాప్రస్థానం’ పేరుతో   ఈ యాత్ర 366 రోజుల పాటు సాగుతుంది. మూడు నెలల కిందట ఆయన ‘మన ఎమ్మెల్యే మన ఇంటికి’ అని నియోజవర్గంలో వాడ వాడ తిరిగి ప్రతి ఇంటి తలుపు తట్టి, ప్రజల మధ్య నివసించి ప్రజాసమస్యలు తెలుసుకున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రం కు ఎనలేని ఆదరణ లభించింది. ప్రజాప్రస్థానం గురించి ఈ రోజున శ్రీధర్ రెడ్డి వివరాలు ప్రకటించారు. ఈ కార్యకమంలో ఆయన ఇల్లిళ్లూ సందర్శిస్తారు. ప్రజలను పేరుపేరున పలకరిస్తారు. తాను ఎమ్మెల్యేగా  గత నాలుగు సంవత్సరాలో   చేసిన పనితీరును వివరిస్తారు. ప్రజలు అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఇందులో లోపాలున్నాయమో తెలియచేయండని కోరతారు. విమర్శలు సేకరిస్తారు. సలహాలు స్వీకరిస్తారు. రూరల్ నియోజకర్గం జిల్లాలోనే  కాదు, రాష్ట్రంలో కూడా విలక్షణమయిన నియోజకవర్గంగా నిలబడేందుకు తాను కృషి చేస్తున్నానని, సహకారం అందించాలని, తనను ఇప్పటిలాగే ఎపుడూ అదరించాలని కోరతారు. ఆయన పర్యటన వివరాలివిగో..

loader