ఇస్లామాబాద్: ముంబై దాడులపై పాకిస్తాన్ మాజీ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులే 2008లో ముంబై దాడులకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. 

పాకిస్తాన్ మీడియా డాన్ తో ఆయన మాట్లాడారు. మిలిటెంట్ సంస్థలు చాలా చురుగ్గా ఉన్నాయని, ప్రభుత్వేతర శక్తులే కావచ్చు గానీ సరిహద్దును దాటడానికి అనుమతించవచ్చునా, ముంబైలో 150 మందికి చంపేందుకు ఎలా అనుమతిస్తాం, విచారణను మనం ఎందుకు పూర్తి చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. 

2008 నవంబర్ 26వ తేదీన లష్కరే తోయిబా మిలిటెంట్లు భారీ సాయుధ సంపత్తితో ముంబైలోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వాటిని 26/11  దాడులుగా చెబుతున్నారు. నవాజ్ షరీఫ్ మాటలను బట్టి ముంబై దాడుల్లో పాకిస్తాన్ పాత్ర ఉందనే విషయం అర్థమవుతోంది.

ముంబైలో ప్రధాన ప్రదేశాలైన ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 166 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.