Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా ఆగస్టు 22న బ్యాంకుల సమ్మె..!

  • దేశవ్యాప్తంగా ఆగస్టు 22న బ్యాంకులన్నీ సమ్మె చేపట్టనున్నాయి
  • సమస్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు యూనియన్ లీడర్ ఒకరు తెలిపారు.
Nationwide bankers strike on August 22

 

దేశవ్యాప్తంగా ఆగస్టు 22న బ్యాంకులన్నీ సమ్మె చేపట్టనున్నాయి. ఈ మేరకు యూఎఫ్బీయూ( ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్) ఈరోజు ఒక ప్రకటన జారీ చేసింది. బ్యాంకింగ్ రంగంలో తలపెట్టిన సంస్కరణలు, తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు యూనియన్ లీడర్ ఒకరు తెలిపారు.

తాము సమ్మె నోటీసు ఇచ్చామని.. ఆగస్టు 22న అన్ని బ్యాంకింగ్ సెక్టార్లు ఈ సమ్మెలో పాల్గొంటాయని  ఆల్  ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్  జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలమ్ చెప్పారు. ఈ నోటీసు చాలా రోజుల క్రితమే ఇచ్చినట్లు ఆయన తెలిపారు. వేతనాల పెంపు.. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు.. తమ ఇతర సమస్యల పరిష్కారార్థం ఈ సమ్మె చేపడుతున్నామని వెంకటాచలమ్  తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు తాము ఈ సమ్మె కొనసాగిస్తామని ఆయన అన్నారు. గతంలోనూ బ్యాంకులు సమ్మె చేపట్టని సంగతి తెలిసిందే. కాగా.. బ్యాంకులు ఈ విధంగా సమ్మెలు చేపడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతారు.  డీ మానిటైజేషన్ అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో.. అలాంటి సమస్యే మళ్లీ ఎదుర్కొనే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios