అక్షయ్ చాలా మంచి వ్యక్తి అంటు భూమి కితాబు. సూపర్ స్టార్ అనే ఇగో ఏ మూలాన కనిపించదు. అందరితో త్యరగా కలిసిపోతారు.

అక్ష‌య్ కుమార్ మంచి చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్, ఎయిర్ లిప్ట్, రూస్తుం, రౌడి రాథోడ్‌, గ‌బ్బ‌ర్ సినిమాల‌తో ఆయ‌న త‌న ప్రత్యేక‌త‌ను చాటుకున్నారు. అంతేకాదు అక్ష‌య్ కామెడి, యాక్ష‌న్ సినిమాల‌కు కూడా అక్ష‌య్ పెట్టింది పేరు. ఆయ‌న నూతన సినిమా టాయిలేట్ : ఎక్ ప్రేమ‌క‌థా. అందులో కూడా ఆయ‌న ఒక వైవిద్య‌మైన క‌థ‌తో ప్ర‌జ‌ల ముందుకు రానున్నారు.

ఈ సినిమాలో న‌టించిన యాక్ట‌ర్ భూమి ప‌డ్నేక‌ర్ అక్ష‌య్ గొప్ప‌త‌నం గురించి వివ‌రించింది. దేశంలో సూప‌ర్ స్టార్ల‌లో అక్ష‌య్ చాలా డిఫ‌రెంట్ అంటూ కితాబు ఇచ్చింది. ఆయ‌నను చూడ‌గానే ఎంత కోపం ఉన్న క‌రిగిపోతామ‌ని, చాలా సాధాసీదాగా ఉంటార‌ని తెలిపింది. సెట్ లో అక్ష‌య్ చాలా ప్రోఫేష‌న‌ల్ అని, నా లాంటి కొత్త న‌టుల‌కు చాలా ప్రోత్స‌హిస్తార‌ని ఆమె తెలిపింది. అక్ష‌య్ లాంటి మంచి మ‌నిషి తో నేను పని చెయ్య‌డం చాలా ల‌క్కిగా ఫీల్ అవుతున్న‌ట్లు తెలిపింది.


దేశంలో ప్ర‌ధాని మోధీ ప్ర‌వేశ‌పెట్టిన‌ స్వ‌చ్చ్ భార‌త్ నేప‌థ్యం లో ఈ టాయిలేట్ సినిమాను నిర్మించారు, కానీ వాణిజ్య విలువ‌లు కూడా ఏ మాత్రం త‌గ్గ‌వ‌ని అక్ష‌య్ గ‌తంలో తెలిపారు. ఈ సినిమా ఆగ‌ష్టు 11వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.