Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్ లో మంత్రి అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు

  • బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే మంత్రివర్గంలో రిషి సునక్ కు కీలక పదవి దక్కింది.
  •  రిషి గత బ్రిటన్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Narayana Murthys son in law Rishi Sunak joins UK PM Mays team

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్‌కు బ్రిటన్‌లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే మంత్రివర్గంలో రిషి సునక్ కు కీలక పదవి దక్కింది. 36 ఏళ్ల రిషి గత బ్రిటన్‌ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

రిషికి హౌసింగ్‌, కమ్యూనిటీస్‌, లోకల్‌ గవర్నమెంట్‌ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి ట్వీట్‌ చేసింది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఎక్కువగా మహిళలకు, మైనార్టీ చట్టసభ సభ్యులకు అవకాశం కల్పించారు.

2015లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నార్త్‌ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌ నియోజకవర్గం నుంచి రిషి సునక్‌ విజయం సాధించారు. ఆక్స్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తిచేసిన సునక్‌ లండన్‌లో ఓ పెట్టుబడి సంస్థను స్థాపించారు. అనంతరం 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో సహవిద్యార్థి అయిన నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని సునక్‌ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios