ప్రతి పక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ఐటి నారా లోకేశ్ చాలా గట్టి గా సవాల్ విసిరారు. తనపై చేసి అక్రమ సంపాదన ఆరోపణలకు ముఖ్యంగా విశాఖభూముల కుంభకోణం గురించి ఆధారాలు చూపాలని లోకేశ్ ట్విట్టర్ లో సవాల్ విసిరారు.

అంతేకాదు, అధారాలు చూపేందుకు ఆయన 24 గంటల సమయం ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.
ఇది మొదటి సారి సవాల్ చేయడం కాదని, మూడోసారి అని చెబుతూ తన సవాల్ కు జగన్ స్పందించకపోవడం పట్ల ఆయన అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇవిగో సవాల్ ఎలా ఉందో చూడండి.
విశాఖపట్నంలో చోటుచేసుకున్న పెద్ద మొత్తం భూకుంభకోణంపై జగన్ ఆధ్వర్యంలో గురువారం ‘సేవ్ విశాఖ’ మహాధర్నా జరిగింది. ఈ కుంభకోణంలో లోకేశ్ పాత్ర ఉందని జగన్ ఆరోపించారు. విశాఖ సమీపంలో ని భీమిలీ ప్రాంతంలో లో 358 ఎకరాల అసైన్డ్ భూములు గంటా బినామీలతో కొనుగోలు చేయించి పూలింగ్ పేరిట జీవోలు ఇప్పించారని, ఆ భూములు కొనడం నేరం అని తెలిసినా కొనొచ్చని లోకేశ్ ద్వారా జీవోలు ఇప్పించారని జగన్ ఆరోపించారు.
దీనికి లోకేశ్ ఈ సాయంకాలం ట్విట్టర్ లో స్పందించారు.