Asianet News TeluguAsianet News Telugu

కృష్ణార్జునుల యుద్ధం బెడసి కొట్టిందా..?

కృష్ణార్జున యుద్ధం రివ్యూ
nani and anupama starer krishnarjuna yuddam movie review


నటీ నటులు.. నాని, అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ దిల్లాన్, బ్ర‌హ్మాజీ, దేవ‌ద‌ర్శిని, నాగినీడు త‌దిత‌రులు 
కూర్పు: స‌త్య.జి
సంగీతం: హిప్ హాప్ త‌మిళ‌
చాయాగ్ర‌హణం: కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
క‌ళ‌: సాహి సురేశ్‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీశ్ పెద్ది
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ

నేచుర‌ల్ స్టార్ నాని అంటే స‌క్సెస్‌కి కేరాఫ్ అడ్రెస్ అయ్యాడు. నాని సినిమా రిలీజ్ అవుతుంది అంటే అది పక్కా హిట్ అనే అభిప్రాయం అభిమానుల‌లో క‌లుగుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈ సారి డ్యూయల్ రోల్ లో సందడి చేయడానికి రెడీ అయ్యాడు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘ కృష్ణార్జున యుద్ధం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని.. తన  సక్సెస్ ని కొనసాగించాడా లేదా..? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ...
కృష్ణ (నాని) చిత్తూరుజిల్లా అక్కుర్తి గ్రామంలోని యువ‌కుడు. పొలాల్లో ప‌క్షులు పంట‌ను నాశ‌నం చేయ‌కుండా పంట‌ల‌కు కాపు కాస్తుంటాడు. నాట‌కాలంటే పిచ్చి. అలాగే ఊర్లోని అమ్మాయిల‌కు ల‌వ్ ప్ర‌పోజ్‌లు చేస్తుంటాడు. వారి ద‌గ్గ‌ర తిట్లు చీవాట్లు తింటుంటాడు. ఓ సంద‌ర్భంలో గ్రామ స‌ర్పంచ్‌(నాగినీడు) త‌న త‌ల్లిన తిట్టాడ‌ని.. అత‌ని కాల‌ర్ ప‌ట్టుకుంటాడు. మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పే మ‌న‌స్త‌త్వం ఉన్న కృష్ణ స‌ర్పంచ్ మ‌న‌వ‌రాలు రియా(రుక్స‌ర్ మీర్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. క్ర‌మంగా కృష్ణ మంచిత‌నం చూసి రియా కూడా త‌న‌ని ప్రేమిస్తుంది. కృష్ణ పేద‌వాడు కావ‌డం ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఆమె తాత‌య్య ఆమెను హైద‌రాబాద్ పంపేస్తాడు. ఈ క‌థ‌కు స‌మాంత‌రంగా ప్రాగ్‌(యూర‌ప్‌)లో అర్జున్(నాని) పెద్ద రాక్‌స్టార్‌. అర్జున్‌కి అమ్మాయిల‌ను ముగ్గులోకి దించే ప్లేబోయ్ మ‌న‌స్తత్వం ఉంటుంది. ఓ సందర్భంలో సుబ్బ‌ల‌క్ష్మి(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌)ను చూసి ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే సుబ్బ‌ల‌క్ష్మి మాత్రం అర్జున్ ప్రేమ‌ను అంగీక‌రించ‌దు. ఆమె హైద‌రాబాద్ బ‌య‌లుదేరుతుంది. ఒక ప‌క్క రియా.. మ‌రో ప‌క్క సుబ్బ‌ల‌క్ష్మిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. వారిని వెత‌కుతూ కృష్ణ‌, అర్జున్‌లు హైద‌రాబాద్ చేరుకుంటారు. ఇంత‌కు కృష్ణ‌, అర్జున్‌లు క‌లుస్తారా? సుబ్బ‌ల‌క్ష్మి, రియాలు ఎమ‌వుతారు? చివ‌ర‌కి క‌థ ఎన్ని మ‌లుపులు తిరుగుతుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఫస్టాప్‌లో కృష్ణ, అర్జున్‌గా రెండు విభిన్నపాత్రల్లో నాని తన స్థాయి నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడనే చెపపాలి. రాయలసీమ యాసలో నాని చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటాయి. యాక్షన్‌ సన్నివేశాలు కూడా  ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌టైన్ చేస్తాయి.  దర్శకుడు మేర్లపాక గాంధీ టేకింగ్ పరంగా ఓకే అనిపించినా కథను ఆసక్తిగా మలచడంలో తడబడ్డాడనే చెప్పాలి. మొదటి సగం సరదాగా సాగిన కథ.. రెండో సగం మాత్రం ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతుంది.
 ఫస్ట్ హాఫ్ లోని కామెడీ.. సెకండ్ హాఫ్ లో కూడా కొనసాగించి ఉంటే బాగుండేది. ఇక హీరోయిన్లు అనుపరమేశ్వరన్ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. మరో హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. లొకేషన్లు, కెమేరా పనితనం చాలా బాగుంది. రెండు పాటలు మాత్రమే వినడానికి బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనే చెప్పాలి. ప్రతిసారి నాని సినిమాల్లో కినిపించే మ్యాజిక్
ఈ సినిమాలో మిస్ అయ్యింది.

ప్లస్ లు..
నాని( కృష్ణ) అనుపమ, రుక్సర్ దిల్లాన్
యాక్షన్ సన్నివేశాలు
రాయలసీమ యాస( చిత్తూరు)

మైనస్ లు
సెకండ్ హాఫ్
రొటీన్ కథ
అక్కడక్కడ సాగతీతగా అనిపించే సన్నివేశాలు
 

Follow Us:
Download App:
  • android
  • ios