జిల్లా ఇన్‌చార్జి మంత్రి సుజనాచౌదరి, నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు మంత్రి అఖిలప్రియకు ఫోన్ చేసి ఎలా అందరిని కలుపుకు పోవాలో సలహాలు ఇచారు. అఖిల ప్రియ వ్యవహార శైలి గురించి సుజనా , కాలువ ఇరువురు ముఖ్యమంత్రికి గురించి వివరించారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి ఓడిపోతే, ఆమెకు ఉద్వాసన తప్పదేమో ననే చర్చకూడా పార్టీ లో మొదలయింది.

అనుభవంలేని అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చి పెత్తనం కట్టబెట్టాక ఆళ్లగడ్డ రాజకీయాలలో మార్పులొస్తున్నాయి.

రాజకీయాలు, ఫ్యాక్షన్ రెండిటిని నడిపిన భూమా నాగిరెడ్డి పూర్వం కుటుంబం కంటే తన ‘వర్గం’కు ఎక్కువ ప్రాధన్యం ఇచ్చేవాడు. ఇపుడు అఖిల ప్రియకు ఒంటరి కావడంతో చుట్టాలు పట్టాలు అమె చుట్టూ చేరిపోయారు కుటుంబం విస్తరించిపోతున్నది.

ఈ గుంపు అఖిల ప్రియ చుట్టూ గోడకట్టేసింది.భూమా పోషించిన ‘వర్గం’ కు అఖిల దూరమయ్యింది. రాజకీయాలలో ‘వర్గం’ ఎంత ముఖ్యమో తెలియకపోవడంతో టిడిపికి చిక్కులొస్తున్నాయి. పార్టీలో ఉన్న ఇతర నాయకులతో పోలిస్తే అఖిల చిన్న పిల్ల కావడంతో ఆమెను గట్టిగా మందలించడం కష్టం గా ఉంది, అలాగని చిన్న పిల్ల కదా అని వదిలేయడం ఇంకా కష్టం అని పార్టీ నాయకుడొకరు ఏషియానెట్ కు తెలిపారు.

ఆమెకు రాజకీయాలాడటం తెలిసి ఉంటే శిల్పావెళ్లేవాడు కాదు, ఎవి సుబ్బారెడ్డి అలిగే వాడు కాదనే నిర్ణయానికి టిడిపి నాయకత్వం వచ్చేసింది. భూమానాగిరెడ్డి శిష్యుడు, ప్రధాన అనుచరుడైన ఎవి సుబ్బారెడ్డిని పార్టీ కార్యక్రమాలలో, అధికార కార్యక్రమాల్లో పాల్గొనకుండా అఖిలప్రియ దూరంగా ఉంచారని చెబుతారు. శిల్పా మోహన్‌రెడ్డి టిడిపిని వీడి వైకాపాలో చేరిన రోజు నంద్యాల పట్టణంలో టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి ఎవికి పిలుపురాలేదు. ఆ సమావేశానికి నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు కూడా హాజరయ్యారు. ఆయనకు ఈ గొడవల మీద లోతుగా అవగాహనం లేదు,’ అని ఆయన చెప్పారు.

మొన్న నంద్యాల మున్సిపల్ టౌన్‌హాలులో పెన్షన్ల పంపిణీ, రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాం జరిగింది. వేలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కూడా ఎవిని దూరంగా ఉంచారు. నిన్నటికి నిన్న నంద్యాల పట్టణంలోని రాజ్ టాకీస్‌లో మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల అత్యవసర సమావేశానికి కూడా ఎవి సుబ్బారెడ్డిని పిలువలేదు,’ అని టిడిపి నాయకులే చెబుతున్నారు.

ఈ సమావేశానికి భూమా బ్రహ్మానందరెడ్డిని పిల్చి ఎవిని దూరంగా ఉంచడంలో భూమా అఖిల ప్రియ పాత్ర ఉందని, ఆమె మంత్రి అయినప్పటి నుండి ఎవి సుబ్బారెడ్డిని కలుపుకుని పోకుండా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నది ఆరోపణ.

ఎవి ఇంట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇదే మెయిన్ టాపిక్ ఎవి వర్గానికి చెందిన వారు చెబుతున్నారు.

అఖిలప్రియ మంత్రి అయినప్పటి నుండి ఆళ్లగడ్డకు చెందిన ఆమె బంధువర్గం కోటరీగా మారింది. ఎవి సుబ్బారెడ్డినే కాదవు, భూమా నాగిరెడ్డి ప్రోత్సహించిన కౌన్సిలర్లను కూడా ఆమె పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మంత్రి ఇలా ఉండటంతో ఆమె పిఎస్ కూడా తలబిరుసుగా ప్రవర్తిస్తున్నాడని మంత్రి లెటర్ కావాలన్నా అతగాడు అడ్డొస్తున్నాడని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ పరిస్థితిపై ఇన్‌చార్జి మంత్రి సుజనాచౌదరి, నంద్యాల పార్లమెంటు ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు మంత్రి అఖిలప్రియకు ఫోన్ చేస ఎలా అందరిని కలుపుకు పోవాలో సలహాలు ఇచారు. మొత్తానికి సుజనా , కాలువ ఇరువురు ముఖ్యమంత్రికి అఖిల ప్రియ వ్యవహార శైలిగురించి వివరించారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి ఓడిపోతే, ఆమెకు ఉద్వాసన తప్పదేమో ననే చర్చకూడా పార్టీ లో మొదలయింది.