బంగ్లాదేశ్ కి చెందిన ఓ ప్రయాణికుడు విమానంలో వికృత చర్యలకు పాల్పడ్డాడు. దీంతో అతనిని ఢాకా పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  మలిండే ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం శనివారం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఢాకా బయలు దేరింది. కాగా.. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే... ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

తన ఒంటిపై ఉన్న దుస్తలన్నింటినీ తొలగించాడు. అనంతరం ల్యాప్ టాప్ లో పోర్న్ వీడియోలు పెట్టుకొని వాటిని చూడటం ప్రారంభించాడు. అతని చర్యలకు ఒక్కసారిగా ప్రయాణికులు ఖంగుతున్నారు. వెంటనే స్పందించిన ఎయిర్ హోస్టెస్.. అతను వెంటనే డ్రస్ వేసుకోవాల్సిందిగా చాలా మర్యాదగా చెప్పారు. అయినప్పటికీ మాట వినకపోవడంతో.. మరోసారి హెచ్చరించారు.

దీంతో..విమానంలో ని టాయ్ లెట్ కి వెళ్లి డ్రస్ మార్చుకుంటానని చెప్పి..తన  సీట్ లోనుంచి లేచి.. విమానంలోని సిబ్బందిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అతని చర్యలతో విసిగిపోయిన ప్రయాణికులంతా.. అతనిని కుర్చీలో బలవంతంగా కూర్చోపెట్టి.. కట్టేశారు. విమానం ఢాకా చేరుకున్న అనంతరం అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అంతటినీ కొందరు వీడియోలు, ఫోటోలు తీయగా.. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.