రాష్ట్రపతి పదవికి ఎన్‌డిఎ అభ్యర్థిగా ఎంపికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 23వ తేదీన నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నారు. మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలను కోవింద్‌ దాఖలు చేస్తారు. మొదటి సెట్‌ నామినేషన్‌ పత్రంపై ప్రధాని మోడీ సంతకం చేస్తే , రెండవ సెట్‌పై సంతకం చేసే గౌరవం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి దక్కుతున్నది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాాబు నాయుడు ఢిల్లీ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. మొన్న ప్రధాని మోదీ ఫోన్ చేసి, ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ని గెలిపించేందుకు సాయంకోరిన సంగతి తెలిసిందే. ఇపుడు చంద్రబాబు నాయుడు కోవింద్ తరఫున నామినేషన్ ప్రతాలు దాఖలు చేస్తున్నారు.
రామ్నాథ్ కోవింద్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు.
మొత్తం నాలుగు నామినేషన్ పత్రాలను కోవింద్ దాఖలు చేస్తారు.
మొదటి సెట్ నామినేషన్ పత్రంపై ప్రధాని మోడీ సంతకం చేస్తున్నారు. రెండవ సెట్ పై సంతకం చేసే గౌరవం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడకి దక్కింది.
మూడవ సెట్పై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా, నాలుగవ సెట్పై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సంతకాలు చేయనున్నారు.
తెలుగువాళ్ల హవా!
దళితుడుని ముఖ్యమంత్రి చేయాలని సూచించింది తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
ఆ క్యాండిడేట్ని గెలిపించేందుకు ప్రధానికి సహకరిస్తున్నది చంద్రబాబు.
