Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సస్పెండ్ చేయక తప్పలేదు

హైదరాబాద్ లో భూ అక్రమాల కేసులో అరెస్టయి, జైలులో ఉన్న తెలుగుదేశం  ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్ చేయక తప్పలేదు. అన్ని వైపుల నుంచి వత్తిడి రావడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఈ పెద్ద రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్  చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

naidu suspends tdp MLC Deepak Reddy following his arrest in Hyderabad

హైదరాబాద్ లో భూ అక్రమాల కేసులో అరెస్టయి, జైలులో ఉన్న తెలుగుదేశం  ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సస్పెండ్ చేయక తప్పలేదు. అన్ని వైపుల నుంచి వత్తిడి రావడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఈ పెద్దరెడ్డిని పార్టీ నుంచి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ భేటీలో పరిస్థితులను సమీక్షించాక  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డిని భూకబ్జా, ఫోర్జీరీ , బెదింపు, హత్యాయత్నాల ఆరోపణలతో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  అరెస్టుకు ముందు వారు ఆంధ్ర పోలీసుల  నుంచి దీపక్ రెడ్డి అస్తులన వివరాలను, ఇతర సమాచారాన్ని రాబట్టారు.  ఆంధ్రఅధికారులుపూర్తిగా తెలంగాణా సెంట్రల్ క్రయిం స్టేషన్ (సిసిఎస్) అధికారులకు సహకరించారు.

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.2లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉన్న సర్వే నం.129/71లోని 3.37 ఎకరాల స్థలాన్ని ఫోర్జరీ పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు విశాఖ భూ కబ్జా వివాదం ముదురుతున్న నేపథ్యంలో దీపక్ రెడ్డి ని సస్పెండ్ చేసి కొంత మంచిపేరు తెచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు.

 

భూ కబ్జాల వివాదం వల్ల పార్టీ పరువు పోతున్నందున బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దని అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులను చంద్రబాబు ఈ సమావేశంలో హెచ్చరించినట్టుతెలిసింది. పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం, నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కూడా సమన్వయ భేటీలో చర్చించినట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios