టిడిపిలో కలవరం మొదలయింది

First Published 14, Dec 2017, 12:00 PM IST
Naidu sends minister devineni to persuade yalamanchili Ravi against joining ycp
Highlights

వైసిపిలోకి వెళ్లాలనుకున్న నిర్ణయం మారదంటున్న యలమంచిలి రవి

వైసిసి వైపు చూస్తున్నమాజీ ఎమ్మెల్యేను యలమంచిలి రవిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగయినా సరే ఆయన పార్టీ వీడకుండాచూడాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావును పురమాయించారు. ఇపుడాయన  రవితో మంతనాలడుతున్నారు. విశ్వసనీయ సమాచారం  ప్రకారం రవి టిడిపి దూత మాటలు నమ్మడం లేదు,  ఇంతజరిగాక పార్టీలో ఉండలని కరాఖండిగా చెప్పిట్లు ‘ఏషియానెట్ ’ కు సమాచారం అందింది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఒక బలమయిన  నాయకుడిగా యలమంచిలి రవిని వెళ్లిపోతే, అది  టిడిపి ఇమేజ్ ను దెబ్బతీస్తుందని, అంతా మనపార్టీ లో  చేరుతున్నపుడు  మన వారు వైసిపిలో కి వెళ్లడమేమటని అధినేత ప్రశ్నించినట్లు  తెలిసింది. ముందు వరుసలో ఉన్నారు. రవి ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో కొనుక్కోవాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

గత ఎన్నికలపుడు రవికి విజయవాడ ఈస్టు నియోజకవర్గం టికెట్ హామీ ఇచ్చారు. ఆ  హామీతోనే పార్టీలోకి లాక్కున్నారు. తర్వాత ‘అనివార్య కారణాలు’ అని చెబుతూ సీటు గద్దె రామ్మోహన్ రావుకేటాయించారు. ఈఎన్నికలలో  ఆయన బాగా పనిచేశారు. టిడిపి అభ్యర్థి గెలుపొందాక రవిని మళ్లీ పట్టించుకోనేలేదు. నామినేటెడ్ పోస్టు కూడా ఆఫర్ చేయలేదు. అందువల్ల ఇది నమ్మకద్రోహమని రవి భావిస్తున్నారు. దీనికి జవాబుగా నే ఆయన వైసిపిలో చేరాలనుకుంటున్నారు. ఆయన అనుచరులతో  మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆంధ్ర నడిబొడ్డున, అందునా టిడిపి పెట్టని కోట అనుకుంటున్న విజయవాడ నుంచి వలస మొదలవడం శుభసూచకం కాదని టిడిపి వర్గాల్లో వినబడుతూ ఉంది. ఏమయిన, వైసిపిలోకి వెళ్లాలన్న తన నిర్ణయం మారదని రవిచెప్పినట్లు తెలిసింది.

 

loader