Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని పదవి మీద ఆశ లేదు

పెద్ద పెద్ద పదవుల మీద ఆశ లేదు... మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ కు అందివ్వడమే జీవితాశయం

naidu says he is not aspiring the post of prime minister
  • పెద్ద పదవి వద్దు, పెద్దమనసుతో తోడ్పడండి
  • రాష్ట్రాభివృద్ధే ప్రధానం, ప్రధాని పదవి ఆశావహుణ్ణికాను 
  • నీరిస్తా, కరెంటిస్తా, మానవ వనరులున్నాయి
  • ఏపీకి పెట్టుబడులతో రండి
  • గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారు

 

పెద్దమనసుతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే చాలని, తనకు పెద్ద పదవులు అక్కరలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు బుధవారం రాత్రి గ్లోబల్ అకాడమీ తొలిసారి గా పబ్లిక్ సర్వీసు విభాగానికి ప్రకటించిన ‘గ్లోబల్ లీడర్‌షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ అవార్డు’ను స్వీకరించారు. తమదొక చిన్న ప్రాంతీయ పార్టీ అని తాను ఆ పార్టీకి అధ్యక్షుణ్ణి అని, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రినని చంద్రబాబు గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ఒక ఆదర్శంగా, నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నే తన లక్ష్యమని చంద్రబాబు గారు అన్నారు. తమ రాష్ట్రాభివృద్ధికి ఇక్కడ హాజరైన వాణిజ్య, కార్పొరేట్ల మద్దతు కావాలని కోరారు. 
బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుగారు అవార్డు అందుకుంటే, కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఆయన సతీమణి భువనేశ్వరి తనకు ప్రకటించిన అవార్డును అందుకోవటం విశేషం. ముఖ్యమంత్రి గారుమాట్లాడుతూ మంత్రి ప్రీతి పటేల్ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన వారని, ఆమెతో ఇవాళ ఉదయం రాష్ట్రాభివృద్ధికోసం సంభాషించినట్లు తెలిపారు.
‘నాకు ఒక అవార్డు ఇచ్చారు. నా సతీమణి మరో అవార్డు స్వీకరిస్తోంది. ఒకటి కార్పొరేట్ రంగం నుంచి, మరొకటి పబ్లిక్ సెక్టర్ నుంచి రెండు అవార్డులు తమకు లభించడం అరుదైన అవకాశమని వివరించారు.
‘కార్పొరేట్ రంగంకావచ్చు , ప్రభుత్వ రంగం కావచ్చు ఈ సంస్థ మంచి నాయకులను ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచమంతా ఇవాళ ప్రభుత్వ పాలనమీద దృష్టి సారించిందని, జవాబుదారీ తనం పెరిగిందని అన్నారు.

‘ మీరు మీ వాటాదార్లతో జవాబుదారీ తనంతో ఉండాలి. నేను గవర్నమెంట్ లో నా షేర్ హోల్డర్స్ అయిన సాధారణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాను. కార్పొరేట్ సెక్టార్ లో మీరు ఎండీలు గా కొంత కాలం ఉంటారు. కానీ రాజకీయనాయకులకు ప్రతి ఐదేళ్లకు ఎన్నికల పరీక్షలే’ అని చంద్రబాబు గారు అన్నారు. అందువల్ల తానింకా మంచిగా పరిపాలించాలని అనుకుంటానని, అది తన కర్తవ్యమని చంద్రబాబు గారుచెప్పారు.
రెండంకెల వృద్ధి మాకే సాధ్యం
భారత్ మహోన్నత దేశమని, రెండంకెల వృద్దిని సాధిస్తున్న దేశం ఏదైనా ఉంటే, అది ఇండియానే అని, సమీప భవిష్యత్తులో మరే దేశం రెండంకెల వృద్ధిని సాధించలేదని ముఖ్యమంత్రి గారుచెప్పారు. భారత్ కు సంప్రదాయంగా వస్తున్న బలాబలాలున్నాయని, జనాభా రీత్యా ఉన్న అనుకూలత ఉందన్నారు. ‘ మా దేశంలో ఆంగ్లం మాట్లాడే వాళ్లు ఎక్కువ. బ్రిటిషర్లు పరిపాలన ప్రభావమని, మీరు మాకు ఇంగ్లీషును కిచ్చారు’ అని నవ్వుతూ అన్నారు. సాంకేతికతలో తామెంతో బలంగా ఉన్నామని, గూగుల్ , మైక్రోసాఫ్ట్ లేదా ఇతర ఐటి కంపెనీల్లో నిపుణుల్లో అత్యధికులు భారతీయులేనన్నారు. విదేశాల్లో భారతీయులు నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఆంధ్రప్రదేశ్ వారు ఒక్కరున్నారు. ఇటీవలే తమరాష్ట్రం విడిపోయిందని, తన హయాంలో సైబరబాద్‌ను నిర్మించి నాలెడ్జి ఎకానమీగా చేసి లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. పెద్ద ఎయిర్ పోర్టు నిర్మించామని, 165 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు నిర్మించానని అన్నారు.
విభజనానంతరం తమదే కొత్తరాష్ట్టంలా ఉందని, అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మూడేళ్లనుంచి కష్టపడుతున్నానని, ఎటువంటి వనరులు లేకున్నా , అసాధ్యమని భావించిన అన్నింటిలో అద్భుతాలు చేశానని చంద్రబాబు గారు చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్‌ ప్రకారం రాష్ట్రాన్ని 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ గా నిలుపుతానన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రాతిపదికన పాలనపై అత్యధిక సంతృప్తి సాధించే దిశగా రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతాన్నారు. ఇది సాధించడానికి 5 గ్రిడ్లు. 7 మిషన్లతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి అయిననాడు 22.5 మిలియన్ యూనిట్ల విద్యత్తు లోటు ఉంటే 3 నెలలకే మిగులు విద్యుత్తు ఉత్పాదన చేసిన వైనాన్ని గుర్తుచేశారు. 
విద్యుత్తు సంస్కరణలతో సోలార్, విండ్ ఎనర్జీ తెచ్చామని, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ఖర్చు తగ్గించామని, భవిఫ్యత్తులో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని అన్నారు. ఇకపై విద్యుత్తు చార్జీలు పెంచం పైగా తగ్గించాలని భావిస్తున్నట్లు చంద్రబాబు గారు తెలిపారు. విద్యుత్తు నిల్వ సామర్ధ్యాన్ని అభివృద్ధి చేస్తే తమను ఎవరూ అధిగమించలేరని చంద్రబాబు గారువివరించారు.
పెట్టుబడులు తెండి
‘మీరు వచ్చి పెట్టబడులు పెడితే మా దగ్గర అత్యంత ప్రతిభ చూపే మానవనరులున్నాయి, మీకు విద్యుత్తునిస్తాం, మీకు నీరిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తమ రాష్ట్రం సెంబర్-1’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వివరించారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తన బాధ్యతలను మరింత గుర్తు చేస్తోందని అన్నారు. పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు చెబుతూ ముఖ్యమంత్రి గారుతన ప్రసంగం ముగించారు. సభలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్ , ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios