నంద్యాలల చంద్రబాబు వరాల వాన పనిలో పనిగా మీడియాకు ఒక భారీ వరం జర్నలిస్టులందరికి ఒక పేద్ద ఇల్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరాలీయడం బాగా ఇష్టం. 2014 ఎన్నికలపుడు ఆయన ఇచ్చిన వరాలకు లెక్కేలేదు. ఇపుడు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా విపరీతంగా వరాలిచ్చారు. నంద్యాల ప్రజల మీద చూపిస్తున్న ఈ వల్లమాలిన అభిమానాన్ని ఇపుడు మీడియా మీదకు కూడా మళ్లించారు. ఓటర్లకిస్తున్నవరాల వరవడిలో రాష్ట్రంలోని జర్నలిస్టులందరికి ట్రిపుల్ బెడ్‌రూమ్(3BK) ఇళ్ళలను నిర్మించి ఇస్తామని శనివారం నాడు నంద్యాలలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు హామి ఇచ్చారు. నంద్యాలలో జరిగే ఎన్నికలల్లో అక్కడ ఉన్న జర్నలిస్టులు టిడిపి మద్దతుగా రాయకపోయినా, వ్యతి రేకంగా రాయడం తగ్గిస్తారమేనని చంద్రబాబు ఆశ కావచ్చు.