రాయలసీమ ప్రజలకు చంద్రబాబు తాజా వరం ఇంతకు ముందు కార్ల ఫ్యాక్టరీ, ఇపుడు విమానాశ్రయం

అనంతపురానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయం ఇవ్వాలనుకుంటున్నారు.

అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే రహదారిలో కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు అనంతపురంలో ఏర్పాటు చేయదలచిన ఎనర్జీ యూనివర్సిటీ ప్రగతి ని ఆయన సమీక్షించారు. కర్నూలు జిల్లా గనిలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పార్క్‌ సహా, అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట, తాడిపత్రి, కడపజిల్లాలోని గాలివీడు, మైలవరంలో నెలకొల్పుతున్న అల్ట్రా మెగా సోలార్ పార్కుల పురోగతిని అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గన్నవరం, రాజమహేంద్రవరం విమానాశ్రయాల్లో రెండో రన్ వే ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. • రాష్ట్రంలో ఈ ఏడాది పోర్టులకు పెరిగిన రద్దీ, ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 8% వృద్ధి నమోదు. రాష్ట్రంలోని విమానాశ్రయాలకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. గతేడాది కన్నా ఈ ఏడాది 16% వృద్ధి.అందువల్ల అనంతపురం విమానాశ్రయం గురించి ముఖ్యమంత్రి యోచిస్తున్నారు.

ఇప్పటికే జిల్లాకు కార్ల ఫ్యాక్టరీ తెచ్చారు. ఇపుడు విమానాశ్రయం. అనంతపురం వాళ్ల పంట పడినట్లేనా... ఇప్పటికే కడప తిరుపతి పుట్టపర్తిలలో విమనాశ్రాయాలున్నాయి. కుప్పం లో ఒకటి వస్తుందట.కర్నూజిల్లాలో ఒర్వకల్లు దగ్గిర ఒక విమానాశ్రయం రాబోతున్నది. వీటికిపుడు అనంతపురం తోడు.