ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థుల్ని రోబోలుగా మారుస్తున్నారు. ఇలాంటి  కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను

విద్యార్థులను వేధించే పద్ధతులను మానుకునేందుకు కార్పొరేట్ కాలేజీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులు గడువు విధించారు.

‘నాలుగైదు రోజులలో మార్పు కనిపించాలి. ఈ మార్పు ను ప్రజలు గ్రహించాలి. సంతృప్తి చెందాలి,’ అని ఆయన ప్రకటించారు. అంతేకాదు, మార్పు తీసుకురాకపోతే ఎవరైనా సరే ఉపేక్షించను అని ఈ రోజు కళాశాలల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలలో ఈ మధ్య విద్యార్థులు అత్మహత్యలు పెరగిపోతూ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో అత్యవసరం సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమాశానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
‘‘ఏపీని నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దాలనుకున్నాను కానీ, విద్యార్థుల్ని రోబోలుగా మార్చే ప్రస్తుత కార్పొరేట్ విద్యావిధానాన్ని అస్సలు సహించను,’ అని ఆయన స్పష్టంచేశారు.
విద్యార్థుల పట్ల అనుసరించాల్సిన వ్యవహారశైలి, విధానాలు, పద్దతులలో తక్షణం మార్పులు తీసుకురాకపోతే కఠినచర్యలకు వెనకాడబోనన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
కార్పొరేట్ కళాశాలలకు స్వీయ నియంత్రణ ఉండాలి, విద్యార్థుల్ని వేధించే పద్ధతులకు తక్షణం వదిలిపెట్టాలని ఆయన సూచించారు.
విద్యార్థుల సోషల్ వర్కుకు 5 శాతం మార్కులు తప్పనిసరి చేస్తున్నామని అంటూ నెలకు ఒకసారి కమిటీతో, మూడు నెలలకు ఒకసారి అన్ని కళాశాలల ప్రతినిధులతో పరిస్థితిని రివ్యూ చేస్తామని ఆయన వెల్లడించారు.

అయితే రాష్ట్రంలో కార్పొరేట్ కళాశాలలో సగం క్యాబినెట్ మంత్రి నారాయణ వి, మిగతవాటిలో సగం నారాయణకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడికి సన్నిహితుడు చైతన్య రాజు నడిపిస్తున్న చైతన్య సంస్థలవే...

మరిన్ని ముఖ్యాంశాలు

*ఆదివారం కచ్చితంగా విద్యార్థులకు చదువు నుంచి మినహాయింపు ఇవ్వాలి...

*అనుమతి లేని కాలేజీలు మూడు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలి...లేదంటే కాలేజీలను మూసివేస్తాం...

*కాలేజీల్లో ఆకస్మిక తనికీలు చేస్తాం...