ఆంధ్రప్రదేశ్‌లో వున్న వనరులు, సానుకూల అంశాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుఫ్లెక్స్‌ట్రానిక్స్ సీఈఓకు వివరించారు. ఆగ్నేయాసియా దేశాల రాకపోకలకు వీలుగా తమ రాష్ట్రం  కేంద్రంగా వుంటుందని,  ఓడ రేవులు, విమానాశ్రయాలు, జల, ఇంధన, మానవ వనరులకు ఏపీలో కొదవ లేదని ఆయన వివరించారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక వాతావరణం,  లాజిస్టిక్ హబ్‌గా మారే అవకాశం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సిఇఒ మైక్ మెక్ నమారాను ఆయన ఆహ్వానించారు.

ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులు పెట్టేందుకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్విసెస్ సంస్థ ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్’కు సూచించారు. ముఖ్యమంత్రి బృందం ఈ రోజు ఫ్లెక్స్‌ట్రానిక్స్ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి మైక్ మెక్‌నమర (Mike McNamara)తో సమావేశమయ్యారు.

ఈ రోజు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి బృందానికి అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు ఘన స్వాగతం పలికాయి. తొలుత ఫ్లెక్స్‌ట్రానిక్స్ (Flextronics) సీఈఓతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో వున్న వనరులు, సానుకూల అంశాల గురించి ముఖ్యమంత్రి వివరించారు. ఆగ్నేయాసియా దేశాల రాకపోకలకు వీలుగా తమ రాష్ట్రం కోస్తా తీరం కేంద్రంగా వుంటుందని ఓడ రేవులు, విమానాశ్రయాలు, జల, ఇంథన, మానవ వనరులకు ఏపీలో కొదవ లేదని ఆన వివరించారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక వాతావరణం, లాజిస్టిక్ హబ్‌గా మారే అవకాశం ఉన్న ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని చంద్రబాబు ఆహ్వానించారు.

దీనికి స్పందిస్తూ తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను మైక్ ముఖ్యమంత్రికి వివరించారు.

విశాఖపట్నంలో ఇప్పటికేతాము కాలుమోపామని తెలిపారు.

ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై మైక్ సానుకూల స్పందనను తెలియజేశారు.

ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా శాన్యోస్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విమానంలో శాక్రమెంటో (Sacramento) విమానాశ్రయంలో దిగి కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ అధికార నివాసానికి వెళ్లారు.

గత పదిహేనేళ్లుగా కాలిఫోర్నియాకు గవర్నర్‌గా వున్న ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీ బ్రౌన్‌తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జాతీయ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన క్రియాశీలక పాత్ర, కాంగ్రేసేతర ఉద్యమాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌కు వివరించారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి ఉపక్రమించామని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో తమ రాష్ట్రానికి కాలిఫోర్నియా సహకారాన్ని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

ప్రకృతిని పరిరక్షించే ఉద్యమాన్ని పౌర భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మలిచామని తెలిపారు. పెద్దఎత్తున జల సంరక్షణ చేపట్టి సేద్యపు రంగానికి ఆలంబనగా నిలవడంతో పాటు, అదే స్థాయిలో వన సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి ఉష్ణోగ్రతలను తగ్గిస్తున్నామని వివరించారు. ఈ ప్రక్రియలో తమకు తోడ్పాటును అందించాలని కోరారు. తమ కొత్త రాజధాని అమరావతిని నిర్మాణదశలోనే సందర్శించి తగు సూచనలు, సహకారం అందించడానికి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రావాలని ముఖ్యమంత్రి గవర్నర్ బ్రౌన్‌ను ఆహ్వానించారు.