ఆంధ్రా కు 10 బిలియన్ డాలర్లకు మించి పెట్టుబడులు

Naidu hopeful of getting 10 billion dollar investments to ap
Highlights

అమరావతిలో రానున్న అయిదు టవర్ల సెక్రెటేరియట్

తొమ్మిది రోజులు విదేశీ పర్యటన వివరాలను ఈ రోజు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విలేకరులకు వివరించారు.ఈ పర్యటనలో భాగంగా 50కి ప్రముఖ సంస్థలతో ముఖాముఖి చర్చలు, 800 మందికి పైగా సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించామన్నారు. పాతికమందికి పైగా వాణిజ్య, రాజకీయ ప్రముఖులతో ముఖాముఖి భేటీలు  10 రౌండ్‌టేబుల్ సమాలోచనలు.. ఐదు అతి ముఖ్యమైన అవగహన ఒప్పందాలు  (ఎంవోయూలు), 75కు పైగా లెటర్ ఆప్ ఇంటెట్స్ చేపట్టడం ఈ పర్యటన విశేషాలుని ముఖ్యమంత్రి చెప్పారు.  రాష్ట్రంలో యువతకు 50 వేలకు పైగా ఉద్యోగావకాశాలు ల‌భిస్తాయ‌ని, 10 బిలియన్ యూఎస్ డాలర్లకు మించి పెట్టుబడులపై చర్చలు ఒకకొలిక్కి తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఇంకా సీఎం చంద్ర‌బాబు ఏం చెప్పారంటే...

 

* గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగిందన్నారు. అప్పుడు ఎక్కువగా ఐటీ కంపెనీల పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలను చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇపుడు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధిపరచడం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

* వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెంచి, సేద్యాన్ని లాభసాటిగా మార్చాలనే స్పష్టమైన విధానంతో చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇలా జరగాలంటే ఈ రంగాన్ని సాంకేతికతతో తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇదే ఆలోచన. ఇందుకోసమే ఎంతోమంది సీఈవోలతో చర్చించడం జరిగిందన్నారు. అమెరికా పర్యటన ఎంతో మంచి ఫలితాన్నిచ్చిందని, వ్యవసాయాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు ఈ పర్యటనలో ఊతం దొరికిందన్నారు.

* ఏరోసిటీ నిర్మాణానికి 10 వేల ఎకరాలు అవసరమవుతుంది. అనుకూల ప్రాంతంపై అధ్యయనానికి  దావోస్‌లో కంపెనీ ప్రతినిధుల బృందం న‌వంబ‌రు మూడో వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావడం జరుగుతుందని, ఆ పర్యటన అనంతరం వచ్చే జనవరిలో దావోస్‌లో ప్రాథమిక నివేదిక అందజేస్తుందని పేర్కొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం అని ప్రపంచ స్థాయి సీడ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దాలని, ఉత్తమమైన విత్తనాల సరఫరా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలాగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

*వివిధ దేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ వాటిని అనుసంధానం చేసే ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. కువైట్‌కు చెందిన అల్ అర్ఫాజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీతో  రెండు ఎంవోయూలు కుదుర్చుకుందని, దుబాయ్ ఎమిరేట్స్ విమానయాన సంస్థలతో కీలక ఒప్పందాలు జరిగాయన్నారు.  ‘ఎమిరేట్స్’ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఇన్ఛార్జి అద్నాన్ ఖాజిమ్, ‘ఫ్లయ్ దుబాయ్’ సీఈఓ ఘయిత్ అల్ ఘయిత్‌ల‌తో  సమావేశమై వారి ముందు నాలుగు ప్రతిపాదనలు సూచించడం జరిగిందన్నారు. అందులో భాగంగా రెండు అంశాల ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్‌లో విమానాశ్రయం నిర్మాణం, రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల నుంచి దుబాయికి విమాన సర్వీసులు, ఆంధ్రప్రదేశ్ ఎమిరేట్స్ హబ్‌గా, ఏవియేషన్ అకాడమీని నెలకొల్పాలని అంశాలను వారి ముందు ఉంచామ‌ని సీఎం చంద్ర‌బాబు వివ‌రించారు.

* లండన్‌లో నేచురల్ స్వీట్‌న‌ర్ల తయారీలో పేరొందిన ప్యూర్ సర్కిల్ ఏపీలో సెట్వియా తోటల సాగుకు అంగీకారం తెలిపింద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. తద్వారా ఈ ప్రాంతంలో సాంప్రదాయ స్వీట్‌న‌ర్ల‌ సాగుకు రైతులకు అవగహన పెంచి పంటలు పాందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాలలో ఇటువంటి సాగుకు ఎక్కువ డిమాండ్ ఉంద‌న్నారు. దీపావళి పండ‌గ‌నాడు అమెరికాలోని వ్యవసాయ క్షేత్రాల్లో తిరిగాను. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని, యాంత్రీకరణ విధానాలను పరిశీలించడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో రైతు కళ్లల్లో ఆనందం చూడాలని భావిస్తున్నాను. నేడు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ఆవశ్యకత ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని, అక్కడ వ్యవసాయం క్షేత్రంలో హార్వెస్టర్ పనివిధానం పరిశీలించాను. హార్వెస్టర్ స్వయంగా నడిపాను. ఇలాంటి ఆవిష్క‌ర‌ణ‌ల‌తో అమెరికా ఏనాడో ముందంజ వేసింది. ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ మన రాష్ట్రానికి తీసుకురావాలనేదే  నా కోరిక అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

*అయోవా విశ్వవిద్యాలయం అగ్రికల్చర్, బయాలజీ ప్రొఫెసర్ వెండీ వింటర్స‌న్‌తో భేటీ అయ్యాం. అయోవా గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక విందు ఇచ్చారన్నారు. వారితో కలిసి నేను ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2017’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనడం జరిగిందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో విదేశాలలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు పయనీర్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలని ‘పయనీర్’ను కోరామని వారు అందుకు అంగీకరించారన్నారు.

 * దుబాయి పర్యటనలో భాగంగా యూఏఈ హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ శాఖ లేడీ మినిస్టర్ ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమితో భేటీ అవడం జరిగిందని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ప్రజల్లో సంతృప్తే పరిపాలనకు గీటురాయిగా భావిస్తూ యూఏఇ ప్రభుత్వం నెలకొల్పిన హ్యాపీనెస్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను అమలుచేస్తోంది. వారు అక్కడ ఒక పద్ధతి ప్రకారం ప్రజల ‘సంతోష సూచి’ స్థాయిని పెంచుకుంటున్నారని. వాటి వివరాలను సందర్శనలో భాగంగా తమ బృందానికి వివరించారన్నారు. డాక్టర్ బీఆర్ షెట్టీ ఆహ్వానం మేరకు అబుదాబీలోని యూఏ ఎక్ఛేంజ్ 37వ వార్షికోత్సవంలో పాల్గొన్నాను. ‘డీజీ ల్యాబ్ కటింగ్ఎడ్జ్ టెక్నాలజీ’ని ప్రారంభించాను. ఎనర్జీ స్టోరేజ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అబూదబీలోని ‘ముబదాల’ కంపెనీ ఆసక్తి కనపర్చింది. ఆ కంపెనీ డిప్యూటీ గ్రూపు సీఈవో హోమిత్ అల్ షిమ్మరీతో సమావేశం అయ్యాను. ఏపీలో ఎలా పెట్టుబడులు పెట్టాలనే అంశంపై సంయుక్త కార్యబృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. అబుదాబీలో ఐబీపీజి, ఐసీఏఐల సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ రోడ్ షోలో ప్రవాసాంధ్రులు, పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నార‌ని తెలిపారు.

* లండన్ పర్యటనలో మొదట మేము ప్రజా రవాణ వ్యవస్థపై అధ్యయనం చేశాము. 6వేల ట్రాఫిక్ లైట్లు, వాహనాలు, పాదచారులు, సైక్లిస్టులకు వేర్వేరు మార్గాలు, ప్రతి కదలికను బంధించేందుకు 30లక్షలకు పైగా నిఘా కెమెరాలు, ప్రతి 400 మీటర్లకు ఒకటి చొప్పున నగరం మొత్తం మీద 19,500 బస్టాపులతో లండన్ మహానగర ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ ఉంది. ఇలాంటి అత్యుత్తమ రవాణా వ్యవస్థను అమరావతిలో అందుబాటులోకి తీసుకురావాలి. లండన్ (టీఎఫ్ఎల్) ముఖ్య సాంకేతిక అధికారి శశివర్మ అక్కడి రవాణా వ్యవస్థ గురించి మాకు వివరించారు. లండన్ పర్యటనలో నార్మన్ ఫోస్టర్ అధినేత లార్డ్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్‌తో సమావేశమయ్యామని, ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బృందం ఇచ్చిన ప్రెజెంటేషన్ తిలకంచడం జరిగిందన్నారు. మన వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్లు రూపకల్పనతో తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఈ భవనాల్లో ప్రతిబింబించేలాగా డిజైన్‌ల‌ను తీర్చిదిద్దాలని సూచించామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న రాజధాని నిర్మాణాల ఆకృతులు వారి మనసుల్లో ప్రతిబింబించేలాగా, గర్వంగా భావించేలాగా నా తల్లి, నా జన్మభూమి అనే అనుభూతి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు.

5 టవర్ల సెక్రెటెరియట్

* ప్రజల ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా ప్రజా రాజధానిగా ఉండాలి. ఆకృతుల్లో ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా రూపకల్పన ఒక టవర్‌లో సీఎం కార్యాలయం, ప్రధాన కార్యదర్శి తదితర కార్యాలయాలు నిర్మాణాలు ఉంటాయన్నారు. ఐదు టవర్లను ఒకే వరుసలో ఏ విధంగా నిర్మించాల‌నే అంశంపై రెండు, మూడు ఆప్షన్లతో నమూనాలను సిద్ధం చేసి చూపించాలని ఆర్కిటెక్టులకు సూచించిన‌ట్లు తెలిపారు. సచివాలయానికి సంబంధించి జరిపిన సమాలోచనలో ఒక స్పష్టత వచ్చింద‌న్నారు. మొత్తం 5 టవర్లుగా సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర మంత్రుల కార్యాలయాలు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాల కోసం 4 భారీ టవర్లు ఉంటాయ‌న్నారు. వీటికి కొంచెం ఎడంగా ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి కార్శదర్శుల కార్యస్థానాలు, సాధారణ పరిపాలన శాఖ కార్యాలయం, వీటిన్నింటితో వేరే టవర్ ఉంటుంది. మొత్తం ఏడు టవర్స్ నిర్మాణం చేపడుతున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు.

 

 

loader