టిక్కెట్టు విషయంలో జాప్యం చేస్తే ఇంకాఏమి సమస్యలు ముంచుకువస్తాయోనన్న ఆందోళనతో వెంటనే భూమా బ్రహ్మాందనదరెడ్డికి టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రకటించారు.

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా సమీక్షలో చంద్రబాబునాయుడు ఈమేరకు ఖరారు చేసారు. భూమా నాగిరెడ్డి అన్న, మాజీ ఎంఎల్ఏ భూమా వీరశేఖరరెడ్డి కుమారుడే భూమా బ్రహ్మానందరెడ్డి. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి మృతిచెందారో అప్పటి నుండే బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు రెడీ అయిపోయారు. ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం కూడా చేసుంటున్నారు.

పోటీ చేసే విషయంలో టిక్కెట్టును ఆశించిన శిల్పా మోహన్ రెడ్డి భంగపడి వెంటనే వైసీపీలోకి జంప్ అయిపోయారు. దాంతో ఖంగుతిన్న చంద్రబాబు వెంటనే జిల్లా నేతలతో అత్యవసర సమావేశం పెట్టారు ఈరోజు. అదే సమయంలో మంత్రి భూమా అఖిలప్రియపై నాగిరెడ్డికి బాగా సన్నిహితుడైన ఏవి సుబ్బారెడ్డి తిరుగుబాటు లేవదీసారు. దాంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయింది. టిక్కెట్టు విషయంలో జాప్యం చేస్తే ఇంకాఏమి సమస్యలు ముంచుకువస్తాయోనన్న ఆందోళనతో వెంటనే భూమా బ్రహ్మాందనదరెడ్డికి టిక్కెట్టు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అధికార పార్టీ ఎప్పుడైతే అభ్యర్ధిని ప్రకటించిందో రాజకీయం బాగా స్పీడయింది. ఇక ప్రకటించాల్సిన బాధ్యత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది. దానికితోడు జనసేన, వామపక్షాలు, కాంగ్రెస్ పర్టీలు ఏం చేస్తాయో చూడాలి.