Asianet News TeluguAsianet News Telugu

వర్షాలు రాలేదా... రెయిన్ గన్ భుజానేసుకుని నేనొస్తా

ఒకవేళ కరువు పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలో సిద్ధంకావటానికి అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ తో రైతులను  ఆదుకుంటాం. భయపడవద్దు.

Naidu assures farmers of help with his rain guns if rains fail

వర్షపాతం ఈ ఏడాది ఆశాజనకంగా ఉందని, అయినా ఆగస్టు నెలలో వర్షాభావ పరిస్థితి ఎదురయి పంటలు ఎండే ప్రమాదం ఏర్పడినట్లయితే మొబైల్ ఇరిగేషన్, రెయిన్ గన్స్ ద్వారా ఎదుర్కొంటాం, రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు హాహీ ఇచ్చారు.

 

శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన  199వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రూ.1,66,806 కోట్ల విలువైన ప్రతిపాదలనతో రూపొందించిన  2017-18 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కరువు హామీ ఇచ్చారు.

 

...ఒకవేళ కరువు పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలో సిద్ధంకావటానికి అనంతపురం జిల్లాలో రెయిన్ గన్స్ తో నమూనా కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం చెప్పారు.

 

ఇప్పుడు మరో 45 నిమిషాల్లో పిడుగుపడుతుందనే అంశాన్ని టెక్నాలజీ సాయంతో తెలుసుకొని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

 

‘గత ఏడాది 30% వర్షపాతం తక్కువ నమోదై ప్రతికూల పరిస్థితులు ఎదురైనా  మంచి ఫలితాలు సాధించాం. ఈ ఏడాది మంచిగా వర్షాలు కురుస్తున్నాయని, ఖరీఫ్ ఫలితాలు అత్యంత ఆశాజనకంగా ఉండాలని ఇప్పుడు  కోరుకుంటున్నాం’ అని చంద్రబాబు వివరించారు.

 

ఒక వ్యక్తిని పసిబిడ్డనుంచి పండుముదుసలి దాకా రాజ్యం అనేక విధాలుగా ఆదుకుంటుందని, అలాగే వ్యవసాయాన్ని విత్తన దశ నుంచి విత్తనాలు మొలకెత్తి పంటకొచ్చి, మార్కెట్లో గిట్టుబాలు ధర లభ్యమయ్యేదాకా ప్రభుత్వం అనేక దశల్లో వివిధ చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios