తన కొడుకు కెటిఆర్ కు కూడా పోయిన సారి కన్నా ఇపుడు తక్కువ మార్కులే వచ్చాయ్. అయినా సర్వే నివేదికలను మూసిపెట్టుకోకుండా బహిర్గతం చేసారు.

ఇద్దరు ముఖ్యమంత్రులకు తేడా ఏమిటో స్పష్టంగా తెలిపే ఘటన ఒకటి తెలంగాణాలో జరిగింది. అదే ప్రజాప్రతినిధులపై సర్వే. తన మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై కెసిఆర్ సర్వే చేయించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు సర్వేల యుగం నడుస్తోంది కాబట్టి ఆ సర్వేపై బాగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వివిధ అంశాలపై ప్రజాభిప్రాయం విషయంలో సర్వేలపైనే ఆధారపడుతున్నారు మరి. చంద్రబాబునాయుడు ఈ విషయంలో బాగా ఎక్కువ ఆధారపడ్డారు. చంద్రబాబుతో పోల్చుకుంటే కెసిఆర్ సర్వేల విషయంలో తక్కువే. అయినా తాజాగా తన ఎంఎల్ఏలు, మంత్రుల పనితీరుపై సర్వే నివేదికలను విడుదల చేసారు. ఇపుడు ఆ నివేదికలపై తెలంగాణాలో బాగా చర్చ జరుగుతోంది.

ఇద్దరు సిఎంలకు ఇక్కడే ప్రధానమైన తేడా ఉంది. చంద్రబాబు తాను జరిపించిన సర్వే నివేదికలను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. రెండో వ్యక్తికి కూడా తెలీకుండా కేవలం సదరు ఎంఎల్ఏకి మాత్రమే సీల్డ్ కవర్లో అందచేస్తారు. అందులోని వివరాలు కేవలం చంద్రబాబు, లోకేష్ కు మాత్రమే తెలుస్తాయి. కవర్ తెరిచేంత వరకూ ఆ ఎంఎల్ఏకి కూడా తెలీకుండా జాగ్రత్త పడతారు. మరి అంత గోప్యత ఎందుకో చంద్రబాబుకే తెలియాలి.

అదే కెసిఆర్ విషయం తీసుకుంటే, ఎంఎల్ఏ, మంత్రుల పనితీరుపై చేయించిన సర్వే నివేదికలను బహిర్గత పరిచారు. మీడియాకు కూడా ధైర్యంగా విడుదల చేసారు. తాజా సర్వేలో తనకు బాగా సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపైన కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తేలింది. అంతదాకా ఎందుకు తన కొడుకు కెటిఆర్ కు కూడా పోయిన సారి కన్నా ఇపుడు తక్కువ మార్కులే వచ్చాయ్. అయినా సర్వే నివేదికలను మూసిపెట్టుకోకుండా బహిర్గతం చేసారు. అది కెసిఆర్ అంటే. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే చంద్రబాబు చేయించిన సర్వేల్లో ఎక్కువభాగం భోగస్వే అనే ప్రచారం జరుగుతోంది. కావాల్సిన వళ్ళకు ఎక్కువ మార్కులు వేయించటం లాంటి కారణాలు బహిర్గతం కాకూడదనే సర్వే నివేదికలను చంద్రబాబు ఎప్పుడూ సీక్రెట్ గానే ఉంచుతారనే ప్రచారం ఉంది.