రాష్టపతి పదవికి జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్  రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నాలుగు సెట్ల నామినేషన్‌ లు దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవన్ లో ఆయన ఎన్ డి ఎ మిత్ర పక్షాల నేతల, మద్దతు దారుల సమక్షంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.రెండో సెట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు  సంతకం చేశారు.

రాష్టపతి పదవికి జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవన్ లో ఆయన ఎన్ డి ఎ మిత్ర పక్షాల నేతల, మద్దతు దారుల సమక్షంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు భాజపా అగ్రనేతలు ఎల్‌కే అడ్వాణీ, అమిత్‌షా, మురళీమనోహర్‌ జోషీ, వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్‌, నితిన్‌గడ్కరీతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం పళనిస్వామి తదితరులు కోవింద్ వెంట ఉన్నారు.

మొత్తం నాలుగు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.

తొలి నామినేషన్‌ పత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. రెండో సెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , మూడో నామినేషన్‌ పత్రంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, నాలుగో పత్రంపై అకాళీదళ్‌ అధినేత ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సంతకాలు చేశారు.