కడప జిల్లా మైదుకూరు  వైసిపి ఎమ్మెల్యే  శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఇంట విషాదం. అయన సోదరుడు శెట్టిపల్లి నాగేశ్వరరెడ్డి (61) శుక్రవారం మృతిచెందారు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, చికిత్స పొందుతూ శుక్రవారంమరణించారు. ఆయనకు భార్య , కొడుకు ,కుమార్తె ఉన్నారు.  నాగేశ్వరెడ్డి మృతితో స్వగ్రామమైన నక్కలదిన్నెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయాల్లో మొన్నమొన్నటి వరకు చాలా క్రియాశీలంగా పనిచేశారు. ఎమ్మెల్యేకు  చేదోడు వాదోడుగా వుంటూ వచ్చారు. ఇది రఘురామి రెడ్డి కి పెద్ద దబ్బ అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. నాగేశ్వరరెడ్డి మృతి  వైసిపి అధినేత జగన్  ఫోనులో రఘురామిరెడ్డిని పరామర్శించి సంతాపం తెలిపారు.