వందేమాతరం తప్పని సరి అనే  ఆదేశంపై అభ్యంతరం వందేమాతరంలో అభ్యంతరకర పదాలు ఉన్నాయన్న ముస్లీలు న్యాయ పోరాటానికి సిద్దమన్న సంఘాలు

వందేమాతరం గేయాన్నిదేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు వారంలో ఒక్కసారైనా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో వారంలో ఒక్కరోజైనా వందేమాతర గేయం ఆలపించాల‌ని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. స్కూళ్ల‌తో పాటు కార్యాల‌యాల‌కు కూడా ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. కుదిరితే ప్రతిరోజూ వందేమాతరం ఆలపించాలని, లేని పక్షంలో వారంలో ఒక్కరోజైనా గేయాన్ని ఆలపించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

అయితే హై కోర్టు ఇచ్చిన ఆదేశాల పై దేశంలోని ముస్లీం సంఘాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. వందేమాతరం గేయం ముస్లింలకు వ్యతిరేకమని, అందులో కొన్ని అభ్యంతరకర పదాలున్నాయని వారు చెబుతున్నారు. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పోరాడతామని ముస్లిం సంఘాల నాయకులు ప్రకటించారు. ఇప్పటికే గోరక్షాదళాలు రెచ్చిపోతూ సెక్యులర్ దేశాన్ని మత ప్రాతిపదిక దేశంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాయని వారు వాపోయ్యారు. అయితే ఇలాంటి తీర్పులు వారికి మరింత అవకాశంగా మారుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 


మ‌ద్రాస్ హై కోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై న్యాయ పోరాటం చేస్తామ‌ని ముస్లీం సంఘాలు తెలిపాయి.