ట్రక్కు కింద పడి మహిళా బైకర్ దుర్మరణం గుంతల మయంగా ముంబయి రహదారులు
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా బైకర్ దుర్మరణం చెందిన సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘వుమెన్ ఓన్లీ బైకర్స్’ క్లబ్‌కు చెందిన 34 ఏళ్ల జాగృతి విరాజ్ తన బృందంతో కలిసి ద్విచక్రవాహనాలపై ముంబయిలోని బాంద్రా నుంచి జవహర్ ప్రాంతానికి వారాంతపు సెలవులను గడిపేందుకు బయలుదేరింది.
కాసేపటికే భారీ వర్షం పడి రోడ్డు చిత్తడిగా మారింది. రోడ్డుపై ఉన్నగుంతను తప్పించబోతుండగా ఆమె అదుపుతప్పి కిందపడింది. అదే మార్గంలో వస్తున్న ఓ భారీ ట్రక్కు ఆమె నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమెతోపాటు వస్తున్న స్నేహితులు ఈ ఘటనను చూసి చలించిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ముంబయి నగరంలో రహదారులు గోతులమయమై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని..రహదారులు బాగు చేయాల్సిందిగా కోరుతూ కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించడం లేదు.
