భార్య పొద్దున్నే నిద్రలేవడం లేదని.. వంట కూడా రుచిగా వండటం లేదని ఓ భర్త.. న్యాయస్థానాన్ని ఆశ్రయించడు. పనిసరిగా చేయని  ఈ భార్య నుంచి తనకు  విడాకులు ఇప్పించాలంటూ న్యాయస్థాన్ని కోరిన సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. అయితే.. అతని అభ్యర్థనని తోసిపుచ్చడమే కాక.. న్యాయస్థానం అతనికే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల విడాకులు కావాలటూ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. కాగా.. గురువారం ఈ కేసు హియరింగ్ వచ్చింది. విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని న్యాయమూర్తి సదరు వ్యక్తిని అడగా.. తన భార్య పొద్దునే త్వరగా నిద్రలేవడం లేదని.. వంట రుచిగా వండటం లేదని.. ఆఫీసు నుంచి వచ్చిన తనకి గ్లాసు మంచినీళ్లు కూడా ఇవ్వదని అందుకే విడాకులు కోరుతున్నట్లు చెప్పాడు. కాగా.. అతని భార్య అతని ఆరోపణలను తోసిపుచ్చింది.

ఆఫీస్‌కు వెళ్లే ముందే కుటుంబం మొత్తానికి వంట చేస్తానని  ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆమె పొరుగింటి వాళ్లుకూడా భార్యకే మద్దతు ఇచ్చారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇంటి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తున్నానని ఆమె న్యాయస్థానానికి తెలిపింది. దీనికి సంబంధించి సాక్ష్యాలను కూడా చూపించింది. కానీ భర్త, అత్తమామలు తనను చిన్నచూపు చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా మాట్లాడింది.

‘భార్య ఇంటి పనితో పాటు ఆఫీస్‌కు వెళ్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆమె ఆఫీస్‌ నుంచి వచ్చేప్పుడే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకువస్తోంది. ఎంత పని ఉన్నా కుటుంబసభ్యుల కోసం ఉదయం, సాయంత్రం వంట చేస్తోంది. అంతలా ఇంటి పనులు చేసుకుంటున్న ఆమెపై భర్త ఇంటికి వచ్చినపుడు మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించడం తగదు. అసలు ప్రతీసారి ఆమె ఆయనకు ఎదురొచ్చి మంచినీళ్లు ఇవ్వాలని ఎదురుచూడం సరైనది కాదు, ఆమె ఎలాంటి క్రూరమైన పని చేయలేదు’ అంటూ పిటిషనరైన భర్తకు కోర్టు మొట్టికాయలు వేసింది. విడాకుల పిటిషన్‌ను తోసిపుచ్చింది.