సాధారణంగా ఏ మహిళైనా బిడ్డకు హాస్పటల్ లో నే జన్మనిస్తుంది. కొందరు ఇంటి దగ్గరే ప్రసవిస్తారు. కొద్ది మంది మాత్రం అత్యవసర పరిస్థితుల్లో హాస్పటల్ కి వెళ్లే దారిలో, బస్టాప్ లో జన్మనివ్వడం లాంటి వార్తలు వింటూ ఉంటాయి. అయితే.. ఓ మహిళ మాత్రం సముద్రపు నీటిలో అలల మధ్యలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన ఈజిప్టు లోని దహాబ్ పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దహాబ్ పట్టణంలో షర్మ్ -ఎల్-షేక్ అనే ప్రముఖ రిసార్ట్ ఉంది. ఈ హోటల్.. నీటిలో బిడ్డలు కనడానికి చాలా ప్రసిద్ధి. నెలలు నిండిన మహిళలు మరికొద్ది రోజుల్లో ప్రసవం అవుతుందనగా.. ఈ రిసార్ట్ కి వస్తారు. రిసార్ట్ పక్కన ఉన్న సముద్రంలో డెలవరీలు చేసుకుంటున్నారు. ఈ రిసార్ట్ లో ఈ రకం డెలవరీలు చేసే స్పెషలిస్ట్( డాక్టర్) కూడా ఉన్నారు. ఆ డాక్టర్ సహాయంతోనే ఇటీవల రష్యాకి చెందిన ఓ మహిళ.. తన బిడ్డకి జన్మనిచ్చింది.

బిడ్డ పుట్టిన వెంటనే.. ఆ బిడ్డను డాక్టర్ చేతులతో పట్టుకొని తీసుకువస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో బిడ్డకి కనీసం బొడ్డు కూడా కట్ చేయకుండా ఉన్నాయి. కాగా..  ఈరకంగా ఎవరైనా డెలవరీ ప్లాన్ చేసుకుంటారా...? బిడ్డకు ఏదైనా హాని జరిగి ఉంటే ఏమయ్యేది అంటూ.. పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.