Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్‌  ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో రూ.149కే టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం

multipurpose fibernet services begin in Andhra Pradesh

కేవలం నెలకు రూ.149కే టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సదుపాయం (డేటా, వాయిస్, వీడియో సేవలు) కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైబర్ నెట్ తీసుకువస్తున్నది.ఈ సేవలు ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వివిధ దశలలో రాష్ట్రమంతా విస్తరిస్తాయి. రాష్ట్రపతి కోవింద్ అంధ్రప్రదేశ్ సచివాలయం లో పైబర్ నెట్ ప్రారంభించనున్నారు.

multipurpose fibernet services begin in Andhra Pradesh

  విద్యుత్ స్తంభాలు ఆసరాగా ఫైబర్ గ్రిడ్ పథకం రూపుదిద్దుకుంది. భూగర్భ కేబుల్స్‌తో రూ.5వేల కోట్ల వ్యయం కాగల ప్రాజెక్టును, కరెంటు స్తంభాల ఆధారంగా డిజైన్‌చేసి కేవలం రూ.400 కోట్ల వ్యయంతోనే రూపకల్పన చేశారు. హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ వౌలిక సదుపాయంతో ఆంధ్రలో అన్ని పట్టణాలు, మారుమూల గ్రామాలు సైతం ఇంటర్నెట్‌తో అనుసంధానమవుతాయి.  ఫైబర్‌నెట్‌తో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేసే ఉద్దేశంతో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఈ ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. గృహ వినియోగదారులే కాకుండా వ్యాపా ర, వాణిజ్య వర్గాల వారి అవసరాలకూ ఫైబర్ నెట్ సేవలు అందుతాయ.

రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల ఖరీదైన సెట్ టాప్ బాక్సును నెలకు రూ .99 వంతున చెల్లించి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, టెలిఫోన్‌, 250 టీవీ ఛానళ్ల ప్రసారాలు… ఈ సేవలన్నీ ఒకే కనెక్షన్‌తో ఉంటాయి. అది కూడా చౌక ధరలోనే ఇవ్వాలి. అపరిమిత ఫోన్‌ కాల్స్‌, వీడియో కాలింగ్‌, వీడియో కాన్ఫరెన్స్‌ వంటి సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి.బుల్లి తెరను ఇది కంప్యూటర్‌గా మార్చేస్తుంది . మనకు నచ్చిన కార్యక్రమాలు చూసే (ఇంటరాక్టివ్‌ టీవీ) సదుపాయం కల్పిస్తుంది. భవిష్యత్తులో రియల్‌టైంలో కరెంటు మీటర్ల రీడింగ్‌ నమోదు, టెలిమెడిసిన్‌ వంటి అనేక సేవల్ని ఈ విధానంలో అందజేయాలి చూస్తున్నారు.ఫైబర్ గ్రిడ్ కోసం ఆగస్టు 2015న ‘ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సంస్థ’ను ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు తొలి దశను ముఖ్యబమంత్రి చంద్రబాబునాయుడు 2016 మార్చి 17న విశాఖలో ప్రారంభించారు. ఫైబర్‌ గ్రిడ్  ద్వారా ప్రతి ఇంటికీ 15 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్నది లక్ష్యం.

ఇలాంటి లక్ష్యాలతో చేపట్టిందే ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు! రాష్ట్రాన్ని ‘డిజిటల్‌ ఏపీ’గా తీర్చిదిద్దే బృహత్తర ఆశయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 27న జాతికి అంకితం చేస్తున్నారు. ఇంత వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,03,613 గృహాలకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే మార్చికి కనీసం 10 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇళ్లకు ఇచ్చే కనెక్షన్లకు నెలకు రూ.235 చొప్పున వసూలు చేస్తారు. దీనిలో రూ.149 ఛార్జీ, రూ.35-36 పన్నులు, రూ.50 ట్రిపుల్‌ ప్లే బాక్స్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌. నెలవారీ ఛార్జీగా వసూలు చేసే రూ.149లో రూ.110 ఎంఎస్‌ఓ, కేబుల్‌ ఆపరేటర్లకు, రూ.39 ప్రభుత్వానికి వెళుతుంది. తరువాత అంధ్రప్రదేశ్ సచివాలయం లో పైబర్ నెట్ ప్రారంభించనున్నారు.

ఫైబర్ గ్రిడ్  ప్రారంభం అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్  లో భాగంగా రాష్ట్రపతి   నున్న గ్రామ  సర్పంచ్ విజయకుమార్ తో మాట్లాడతారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios