రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ.. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ప్రముఖ వజ్రాల వ్యపారీ, రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా చిన్నకుమార్తె శ్లోక మెహతాతో ఆకాశ్ వివాహం జరగనున్నదని తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందనది, డిసెంబర్ లో పెళ్లి ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ పెళ్లి పై ఇప్పటివరకు ఇరుకుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ఇరు కుటుంబాలకు సన్నిహితులైన ఒకరి ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

ఆకాశ్, శ్లోక.. ఇద్దరూ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయడం కాలక్రమేణా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలపడంతో.. వీరి ప్రేమ పెళ్లి వైపు అడుగులు వేస్తోందనే ప్రచారం జరుగుతోంది.