కాపు రిజర్వేషన్ల ఉద్యమంలోకి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించేందుకు ముద్రగడ నిర్ణయం
కాపు రిజర్వేషన్ల ఉద్యమంలోకి భారీ గా మహిళలను సమీకరించాలని ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం యోచిస్తున్నారు.
ఇప్పటి వరకు కాపు రిజర్వేషన్ల ఉద్యమం పురుషులకే పరిమితమయింది. ఎవరో కొంతమంది కాపు మహిళనేతలు తప్ప సాధారణ మహిళలు పెద్దగా లేరని చెప్పాలి. తుని సమావేశానికి కూడా పెద్ద గా మహిళలు రాలేదు. అయితే, అదివారం నాటి ఆకలి కేకలో పురుషుల కంటే మహిళలే పెద్ద ఎత్తున పాల్గొనడం ముద్రగడను ఉత్తేజ పరించింది.
ఆదివారం నాడు కాపుల ఆకలి కేకలో భాగంగా అన్నం పళ్లెంను గరిటతో మోగించే తమ ఘోష అమరావతికి తాకించే కార్యక్రమం అన్ని జిల్లాల్లో నిర్వహించారు. కాపు జెఎసి నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొనడం ఒక విశేషమని ఆయన చెప్పారు.
కొవ్వూరు మండలం పశివేదలలో ఇటీవల ముప్పిడి భూషణం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, వైసిపి నాయకుడు ముప్పిడి విజయరావును పరామర్శించేందుకు ముద్రగడ సోమవారం గ్రామం వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఉద్యమంలో కాపు మహిళల భాగస్వామ్యం మరింత పెంచేందుకు జనవరి 5న కాకినాడలో సమావేశం నిర్వహిస్తున్న విషయం కూడా ఆయన వెల్లడించారు.
మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే ఉద్యమాలు బాగా విజయవంతమవుతాయని అందువల్ల వారి భాగస్వామ్యం ముందు ముందుపెరుగుతుందనే ఆశాభావం కూడా ఆయ వ్యక్తం చేశారు.
ముద్రగడ ఒంటరి కాదు. ఆయన చేసే పోరాటం ఆయన భార్య తప్పని సరిగాకనిపిస్తారు. ఈ మధ్య ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నపుడల్లా ఆయన భార్య కూడ దీక్షలో ఉన్నారు. అందువల్ల ఉద్యమంలో పాల్గొనే నాయకులంతా విధిగా వారి కుటుంబ సభ్యలను కూడా భాగస్వాములను చేయాలనేది ఆయన కోరిక కాబోలు.
బిసిల్లో చేర్చేవరకూ ఉద్యమం ఆగదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు గాలికొదిలేసి కాపులను అవమానపర్చింనందు వల్లే ఆందోళన చేపట్టాల్సి వస్తోన్నదని ఆయన అన్నారు.
